Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

సీపీఐ బలోపేతానికి నిరంతర పోరాటాలు

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

వివిధ కార్యక్రమాలు, ఉద్యమాలను నిర్వహించడంద్వారా పార్టీని బలోపేతం చేయాలని దిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ సమితిసమావేశం తీర్మానించింది. పార్టీని తిరిగి పునరుత్తేజం చేయాలని నిరంతరపోరాటాలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. పార్టీని స్థాపించి 2024 డిసెంబరు 26వ తేదీకి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలు 9 సీట్లను మాత్రమే గెలుచుకున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది. జులై 13,14,15తేదీలలో దిల్లీలో పార్టీ జాతీయ సమావేశం జరిగింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా రాజకీయ, ఆర్థిక, అభివృద్ధి పార్లమెంటరీ ఎన్నికలపై నివేదిక సమర్పించారు. సాధించవలసిన లక్ష్యాలను సమావేశం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మితవాదశక్తులు పెరుగుతున్న సందర్భంగా ఉదారవాద, బూర్జువా, ప్రజాస్వామ్యశక్తులు సవాలును ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి ఐరోపాలోనే కాదు, మన ప్రాంతంలోనూ ఉన్నది. ఆయా దేశాల్లో స్థిరపడిన విదేశీయులు, వలసలపై, ప్రత్యేకించి ముస్లింలపైన విద్వేష రాజకీయాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతటా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ధోరణి నుంచి మన దేశం వేరుగా ఏమీలేదు. వాస్తవంగా ఈ ధోరణి మరింత బలపడుతోంది. ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీలు, వామపక్షపార్టీలు, మైనారిటీలను లక్ష్యంగా పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ పనిచేస్తున్నది. ఈ శక్తులపైన బలమైన సైద్ధాంతిక పోరాటాన్ని నిర్వహించాలి. బీజేపీ ప్రభుత్వం దందుడుకుగా ప్రజాస్వామ్య రహితంగా పనిచేయడం కొనసాగిస్తోంది. ఈ పరిస్థితిపైన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 2024జులై 1వ తేదీనుంచి కొత్త క్రిమినల్‌ చట్టాలను బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలమైంది. నయా ఉదాదరవాద విధానాలను, విద్వేష రాజకీయాలను, మత,కుల ప్రాతిపదికపై ప్రజల సమీకరణను, కార్పొరేట్‌ ఎజండాను నివారించేందుకు మరింత తీవ్రంగా పోరాటాలు నిర్వహించాలి. అన్ని సెక్యులర్‌, ప్రజాస్వామ్య, వామపక్షశక్తులు మన దేశ సెక్యులర్‌, ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు నిరంతరం పోరాడాలి. ఇందుకు ఇండియా ఐక్యసంఘటన మద్దతుతో పార్లమెంటు లోపల, వెలుపల పోరాడవలసిందే. ప్రజల జీవనభృతి తదితర సమస్యలపైన స్వతంత్రంగా, వామపక్షపార్టీలతో కలిసి సంయుక్తంగా నిరంతర పోరాటాలు చేయాలి. ఈ పోరాటాలు మధ్యేవాద, ప్రాంతీయ పార్టీలపై సైద్ధాంతిక, రాజకీయ ప్రభావం కలిగేలా ఉండాలి. అలాగే పలస్తీనా ప్రజలకు అండగా, నాటోకు వ్యతిరేకంగా పార్టీ ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహించాలి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దుష్టపాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర, జిల్లాస్థాయిలో ఉధృత ప్రచారాన్ని నిర్వహించాలి. బీజేపీని ఓడిరచేందుకు ఉదారవాద బూర్జువా శక్తులు, ప్రాంతీయపార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండియా ఐక్యసంఘటన విశాలవేదికగా కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, మానవ హక్కుల కోసం కార్మికులు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులతో కలిసి స్వతంత్రంగా, ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా అసెంబ్లీలకు జమ్ముకశ్మీర్‌లలో జరగనున్న ఎన్నికల్లో రాజకీయ, సంస్థాగతంగా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలి. సీపీఐ శతవార్షికోత్సవాల కార్యకలాపాల పరిధిలోనే ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేకించి కేరళలో వామపక్షం ఒక సీటును మాత్రమే గెలుచుకున్నది. వామపక్షశక్తులు ఈ రాష్ట్రంలో తక్కువ ఓట్లను పొందడంపై సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది. సీపీఐ 4సీట్లలో పోటీచేసింది. త్రిసూర్‌లో సీపీఐ బలమైన అభ్యర్థిని పోటీచేయించినప్పటికీ ఓడిపోయింది. ఈ పరిస్థితిపైన జాతీయసమితి సమావేశం గాఢంగా చర్చించింది. రాజ్యాంగాన్ని మార్పుచేయాలని బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని తుత్తినియలు చేసిన ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులను సమావేశం అభినందించింది. రానున్న రెండు సంవత్సరాలలోనూ బీజేపీ, యుడిఎఫ్‌ శక్తులపైన సీపీఐ, సీపీఎంలు సంయుక్తంగా బలమైన పోరాటాలను నిర్వహించక తప్పదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్లపంపిణీ మరింత మెరుగ్గా జరిగిఉంటే ఇండియా ఐక్యసంఘటనకు మరింత మేలైన ఫలితాలు లభించిఉండేవి. ఇండియా ఐక్యసంఘటన బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ సంఘటన భవిష్యత్తులో మరింత బలపడేందుకు సీపీఐ గట్టిగా కృషిచేస్తుంది. ప్రతిపక్ష నాయకులను హింసించేందుకు బీజేపీ ప్రభుత్వం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇండియా ఐక్యసంఘటనతో సీపీఐ కొనసాగుతుంది. విశాల వేదికద్వారా పోరాటాలు నిర్వహించడంతోపాటు కమ్యూనిస్టుల ఐక్యతను, విశాలమైన వామపక్ష శక్తులను బలోపేతం చేయడానికి పోరాటం నిర్వహించాలి. త్వరలో లోక్‌సభలో 202425వ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఆరోగ్యరంగాన్ని పటిష్టం చేసేందుకుగాను జీడీపీలో 3శాతం కేటాయించాలని ఆర్థికమంత్రికి సీపీఐ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆరోగ్యరంగానికి ప్రభుత్వం జీడీపీలో కేవలం1.35శాతం మాత్రమే కేటాయించింది. ప్రపంచంలో ఇది అతి తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య రంగానికి అత్యంత అధికంగా వ్యయం భారతదేశ కుటుంబాలలో జరిగిందని, ఈ పరిస్థితి 17శాతానికిపైగా కుటుంబాలు ఎక్కువగా అనుభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 మార్చిలో ప్రకటించింది. ఫలితంగా ప్రజలను పేదరికంలోకి నెట్టారు. విధ్వంసకర ఆరోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు తమ సంపాదననుంచి ఖర్చు చేయడం ఎంతో కష్టంగా ఉంటుంది. సంపాదించిన నిధులను ఆరోగ్య పరిరక్షణకు తప్పనిసరిగా వినియోగించవలసి వస్తోంది. భారతదేశ ప్రజలు ప్రతి ఏటా 55మిలియన్‌ డాలర్లు సొంతంగా ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యభద్రత కోసం ఇండియా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇన్‌ఫెక్షన్లుసోకే వ్యాధులకు ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయవలసివస్తోంది. సాంక్రమిక వ్యాధుల నివారణ కోసం అత్యధికంగా ఖర్చు చేయవలసివస్తున్నది. అందువల్ల 202425 బడ్జెట్‌లో తప్పనిసరిగా 3శాతం కేటాయించాలని సీపీఐ ఆర్థికమంత్రిని కోరింది. ఆరోగ్యరంగం, ఈ సంవత్సరం అనుభవించిన ఉష్ణోగ్రతలు, చత్తీస్‌ఘర్‌లో గిరిజనులపై నకిలీ ఎన్‌కౌంటర్లు, త్రిపుర ప్రభుత్వం వామపక్షాలపైన చేస్తున్న దాడులు, చట్టాల దుర్వినియోగం, నీట్‌ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్‌ సంక్షోభం, మహారాష్ట్రలో ప్రత్యేక ప్రజాభద్రతా బిల్లు`2024 పైన జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కల్పించాలని కోరుతూ, మణిపూర్‌ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, తదితర డిమాండ్లతో ఈ సమావేశం అనేక తీర్మానాలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img