London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఇండియా కూటమిలోకి మరిన్ని పార్టీలు

నిత్య చక్రవర్తి

పద్దెనిమిదవ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతోనే సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోదీకి అప్పుడే రెండు అపశకునాలు ఎదురయ్యాయి. మరోపక్క ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరిన్ని పార్టీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక లక్షల మంది భవిష్యత్‌కు సంబంధించిన నీట్‌ పరీక్షల ప్రశ్నాపత్రాల వెల్లడి కుంభకోణం మోదీ ప్రభుత్వ తలకు చుట్టుకుంది. ఎన్నికలకు ముందు ఈ కుంభకోణం వెల్లడైఉంటే బీజేపీ పరిస్థితి మరింత దిగజారి ఉండేది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వహయాంలో వ్యాపం కుంభకోణం దేశమంతటా గగ్గోలు పుట్టించింది. మోదీ ప్రభుత్వం సైతం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది.
ప్రచార ఆర్భాటంతో నిర్మించిన రామాలయం పై కప్పు వర్షం వస్తే నీళ్లు కారుతోందని వెల్లడై ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. బీజేపీ ఎంపీలకు కొత్తప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తున్న సమయంలోనే రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్రదాస్‌ ఆలయం పై కప్పు నీళ్లు కారే అంశం మోదీకి తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం కోసం దేశ విదేశాల్లో రామాలయంపై మోదీ ఆర్భాటంగా డప్పు వాయించారు. ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. లోక్‌సభ సమావేశాల మొదటి రోజున ఇండియా కూటమి సభ్యులు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ, రాజ్యాంగం పుస్తకాలను పట్టుకొని ప్రదర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లోనూ ఇదే విషయాన్ని విస్త్రతంగా ప్రజలకు వివరించారు. దీనిపై ప్రజలు సానుకూలంగా స్పందించారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. మోదీ పదేళ్లకాలంలో ప్రజాస్వామ్యాన్ని దిగజార్చిన అంశంపై ప్రతిపక్షం మోదీ ప్రభుత్వాన్ని నిలదీయనున్నది. లోక్‌సభ ఎన్నికల్లో పొందిన ప్రయోజనాలను మరింత పట్టిషం చేసుకునేందుకు ఇండియా కూటమికి ఇది మంచి అవకాశం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకు దూరంగాఉన్న మరికొన్ని పార్టీలు ఇండియాకూటమిలో చేరనున్నాయన్న సూచనలు వెలువడ్డాయి.
ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బీజేపీతో సంబం ధాలను పూర్తిగా వదుల ుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, రాజ్యసభలో ఉన్న 9మంది తమ పార్టీ సభ్యులను ఇండియా కూటమితో సమన్వయం చేసుకుంటూ, మోదీ ప్రభుత్వ విధానాలపై పోరాడాలని ఆదేశించారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు జరిపిన చర్చలు విఫ˜లం కావడంతో నవీన్‌ పట్నాయక్‌ బీజేపీ పొత్తులేదని ప్రకటించారు.
రాజ్యసభలో మొత్తం 245 సీట్లుండగా, ఇండియా కూటమికి 85 మంది సభ్యులున్నారు. బీజేడీకి చెందిన 9మంది సభ్యులు చేరితే మొత్తం సంఖ్య 94కు చేరుతుంది. రాజ్యసభలో వైసీపీ సభ్యులు 11మంది ఉన్నారు. వీరు ఇండియాకూటమికి సహకరిస్తే ప్రతిపక్షం సంఖ్య 105కు చేరుకుంటుంది. అప్పుడు ప్రతిపక్షం రాజ్యసభలో బలంగా ఉంటుంది.
బీజేడీ, వైసీపీ సభ్యులు ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడినట్లుగా ఆ పార్టీవర్గాలు తెలియజేశాయి. అలాగే రాజ్యసభలోనూ మరికొన్ని చిన్నచిన్న పార్టీలు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఇండియా కూటమికి తోడ్పాటు అందించాలని ఆసక్తిగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై సమీక్షించుకునే పనిలో ఈ పార్టీలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే టీఎంసీి, డీఎంకే నాయకులను ఇండియా కూటమిలో వారి స్థానాలను గురించి చర్చించనున్నారు. బీజేపీతో పోరాడేందుకు ప్రతిపక్షానికి మరింత బలం చేకూరనుంది. త్వరలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ దిశగా చర్చలు జరగనున్నాయి. ప్రతిపక్షకూటమి కలిసికట్టుగా పోరాడి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఈ రాష్ట్రాల ఎన్నికల తర్వాత 2025లో దిల్లీ, బీహార్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా, బీహార్‌లలో ప్రతిపక్షాలు పటిష్టంగా ఒక్కటిగా ఉన్నాయి. ఆయా పార్టీల మధ్య సీట్ల పంపిణీపై ముందుగానే చర్చించి ఒక నిర్ణయానికి రానున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటికే జరిగిన తప్పిదాలను గుర్తించి సరిచేసుకునేందుకు రాజకీయ, ప్రభుత్వ స్థాయిల్లో తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న 2024`25 బడ్జెట్‌లో ఎన్నికలు జరగనున్న ఆయా రాష్ట్రాలకు సంబంధించి సానుకూల కేటాయింపులు జరిగే అవకాశంఉంది. మోదీ జరిగిన ఎన్నికల్లో నష్టపోయినప్పటికీ తిరిగి పుంజుకునేం దుకు రకరకాల ఎత్తుగడలువేసే అవకాశంఉంది. అందువల్ల ఇండియాకూటమి అప్రమత్తంగాఉండాలి. రానున్న మూడు నెలల్లో ఇండియాకూటమికి కీలకమైన కాలం. పార్లమెంటులో ఇతర పార్టీలతో కలిసి గత మోదీ ప్రభుత్వం చేసిన మూడు క్రూరమైన చట్టాలను ఉపసంహరింపచేసేందుకు ప్రతిపక్షం గట్టిగా పోరాడవలసిన అవసరంఉంది. ఈ చట్టాలు జులై 1నుంచి అమలులోకి రానున్నాయి. నాలుగు లేబర్‌కోడ్‌లను ఉపసంహరించుకోవాలని చర్చకుపెట్టి విజయం పొందాలి. వివిధ సమస్యలు, వ్యవసాయ దుష్టచట్టాలను చర్చకు తీసుకువచ్చి వాటిని కూడా పరిష్కరించవలసి ిఉంది. కనీస మద్దతుధరకు చట్టబద్దమైన హామీకోసం తీవ్ర పోరాటం జరపవలసిందే. ఉద్యోగాలులేని అభివృద్ధికి అనుకూలంగా ఉన్న విధానాలను మార్పించేందుకు తీవ్రమైన పోరాటం చేయవలసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img