London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 9, 2024
Wednesday, October 9, 2024

పంచాయతీరాజ్‌ పాలన నిర్వీర్యం

పంచాయతీరాజ్‌ పాలనావ్యవస్థను మెరుగు పరిచేందుకు 32ఏళ్ల క్రితం 73వ రాజ్యాంగ సవరణ చేశారు. అయితే ఈ సవరణను అమలు చేయకుండా ఉన్నతస్థాయి రాజకీయ, వివిధ స్థాయిలలో గల ప్రభుత్వయంత్రాంగం అడ్డుపడిరది. అంతేకాదు, డిజిటలీ కరణ పంచాయతీరాజ్‌ నిర్వహణ, అధికారంపైన ప్రతికూల ప్రభావం చూపింది. మొదట ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. పంచాయతీల స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నందున చక్కదిద్దేందుకు 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. ‘‘రెండువందల యాభైవేల ప్రజా స్వామ్యాలు: భారతదేశంలో గ్రామీణ ప్రభుత్వం’’ అంశంపై ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనంలో అనేక ఉదాహరణలు పేర్కొంది. సిద్ధార్ధ జార్జి, విజయేంద్రరావు, శరణ్‌ ఈ అధ్యయనాన్ని ధృవీకరించారు. దేశంలోని 2,50,000 గ్రామ పంచాయతీలల్లో దాదాపు 80కోట్ల మంది ప్రజలున్నారు. స్థానిక పాలన గణనీయంగా పురోగమించింది. అధికారాల వికేంద్రీకరణ, కేంద్రం, రాష్ట్ట్ర నిధులు కేటాయింపు, విడుదల అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని అధ్యయన నివేదిక తెలిపింది. నిధుల కేటాయింపు, విధుల నిర్వహణ, పరిపాలనచేసే బాధ్యులు ఏ మాత్రం తగినంతగా లేవు. ఉన్నతస్థాయిలోని రాజకీయ నాయకులు, పాలనా యంత్రాంగం రూపొందించే నియమ నిబంధనలను పంచాయతీల నిర్ణయాధికారాలను అడ్డుకుంటున్నాయి.
ఉదాహరణకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఆర్‌ఎన్‌ఆర్‌ఇజిఏ) అమలును చూద్దాం. గ్రామాల్లో కూలీల డిమాండ్‌ మేరకు పంచాయతీలు పనులు తప్పనిసరిగా చూపించాలని గ్రామీణ ఉపాధి పథకం చట్టం ఆదేశిస్తోంది. గ్రామాలలో ఉండే కూలీలకు ప్రాజెక్టుల పనులు చూపించేందుకు పంచాయతీ సర్పంచ్‌లకు అధికారాలున్నాయి. గ్రామ సభలు నిర్వహించి స్థానిక ప్రజలతో చర్చించి తదుపరి ఏడాది గ్రామ పరిధిలో పనులను నిర్ణయించి పంచాయతీలు ఉపాధి పథకం కింద పనులు చేయించాలి. అయితే సంబంధిత ఉన్నతాధికారుల ఆమోదం తర్వాతనే పనులు చేయించాలి. ఆమోదించిన తర్వాత కచ్చితమైన మార్గదర్శకాలను అనుసరించాలి. ఆమోదించిన ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది, ఏ మెటీరియల్స్‌ కావాలి, అవి ఎవరి దగ్గరనుంచి కొనాలి, వాటి ఖర్చు ఎంత అనే వివరాలు సేకరించాలి. కార్మికుల హాజరు పట్టీలను ఆన్‌లైనులో రూపొందించాలి. హాజరుకు సంబంధించిన అంశాలు, వేలిముద్రలు లేదా ఫొటోలను డిజిటల్‌ రూపంలో తయారుచేయాలి. వేతనాలను నేరుగా పనిచేసేవారి బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. గ్రామీణ ఉపాధి పథకం అమలు బాధ్యత పంచాయతీలదే. గ్రామీణ ఉపాధి హామి పథకం అమలు బాధ్యత పంచాయతీలదే. అయితే ప్రాజెక్టు ఎంపిక, వేతనాల చెల్లింపు విషయాలలో పంచాయతీలకు ఎలాంటి జోక్యానికి అవకాశం ఉండదు. దీనివల్ల నిర్దిష్టమైన జవాబుదారీ అనేది సమస్య అవుతుంది. వేతనాలు చెల్లింపులు ఆలస్యమైనప్పుడు పంచాయతీలు, సర్పంచ్‌లు ఎక్కడో జరిగిన ఆలస్యానికి బాధ్యులవుతారు. ఇది సమస్య అవుతుంది. అనేక అధ్యయనాల నుంచి కొన్ని విషయాలను తీసుకొని తాజా అధ్యయనం ఉదాహరణలుగా పేర్కొంది. పంచాయతీలు స్వతంత్రంగా పనిచేసే సంస్థలుకాదు. సర్పంచ్‌లు లేదా పంచాయతీల యంత్రాంగం తమ పై అధికారులతో ఆయా అంశాలపై సంప్రదింపులు జరపడానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్లాక్‌డెవలప్‌మెంట్‌ అధికారులు (బీడీఓలు), కలెక్టర్లతో మాట్లాడేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ అధికారులు తిరగవలసి ఉంటుంది. 73వ రాజ్యంగ సవరణను పట్టణప్రాంతాల్లో అమలు చేసినందున కలిగిన అనుభవాన్ని తీసుకున్న తర్వాత 74వ రాజ్యాంగ సవరణను క్రమబద్దీకరించడంవల్ల ప్రయోజనం కలగవచ్చునని ప్రపంచ బ్యాంక్‌ అధ్యయనం సూచించింది.

డా.జ్ఞాన్‌ పాఠక్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img