London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

పశ్చిమాసియాలో కల్లోలం

డి. రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి

అమెరికా, ఇజ్రాయిల్‌ తదితర పశ్చిమరాజ్యాలు పశ్చిమాసియాలో ఘర్షణలు పెరిగిపోవడానికి దోహదం చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయాలు, వనరులు ప్రాంతీయ ఆధిపత్యాన్ని కల్పించాయి. ఇరాన్‌లాంటి దేశాలలోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 20వ శతాబ్దం మధ్య కాలంనుంచి అమెరికా విదేశాంగ విధానం ఈ ప్రాంతంలో పలుకుబడిని పెంచుకునేందుకు ప్రాధాన్యత నిచ్చారు. చిన్నచిన్న దేశాలలో జోక్యం సమస్యల పరిష్కారంకంటే ఉద్రిక్తతలను పెంచడానికి అవకాశం కుదిరింది.

ఉక్రెయిన్‌`రష్యా మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా నాటో విస్తరిస్తోంది. సంఘర్షణలు, యుద్ధాలు నిరోధించేందుకు, శాంతపరచేందుకు ప్రస్తుత ప్రపంచవ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అనేక అంశాల సమ్మేళనం దీర్ఘకాలంగా రాజకీయ అస్థిరత, అమెరికా, నాటో సామ్రాజ్యవాద జోక్యం మరింత ముమ్మరమైంది. సిరియా, యెమెన్‌, ఇరాక్‌ తదితర దేశాలలో మానవ సంక్షోభం పశ్చిమరాజ్యాల జోక్యం కారణంగా పెరిగింది. ప్రాంతీయ రాజ్యాలు సౌదీ అరేబియా, టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవల పలస్తీనా, ఇరాన్‌, లెబనాన్‌, గల్ఫ్‌ దేశాలపైన ఇజ్రాయిల్‌ దాడులు పెరిగిపోయాయి. ప్రపంచంలో శాంతి పెళుసుగా తయారైంది. అమెరికా, నాటో అధ్వర్యంలో ప్రపంచదేశాలు అనేక ప్రాంతాలలో వ్యూహాత్మకంగా మారిపోతున్నాయి.
ప్రపంచంలో అనేక చోట్ల ఘర్షణలు ఉద్రిక్తంగా తయారయ్యాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ తదితర పశ్చిమరాజ్యాలు పశ్చిమాసియాలో ఘర్షణలు పెరిగిపోవడానికి దోహదం చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయాలు, వనరులు ప్రాంతీయ ఆధిపత్యాన్ని కల్పించాయి. ఇరాన్‌లాంటి దేశాలలోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 20వ శతాబ్దం మధ్య కాలంనుంచి అమెరికా విదేశాంగ విధానం ఈ ప్రాంతంలో పలుకుబడిని పెంచుకునేందుకు ప్రాధాన్యత నిచ్చారు. చిన్నచిన్న దేశాలలో జోక్యం సమస్యల పరిష్కారంకంటే ఉద్రిక్తతలను పెంచడానికి అవకాశం కుదిరింది. ఐఎస్‌ఐఎస్‌ వంటి తీవ్రవాద గ్రూపులు పెరగడానికి సామ్రాజ్యవాద దేశాలు దోహదం చేశాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌, పలస్తీనాల మధ్య దీర్ఘకాలంగా ఘర్షణలు, దాడులు సాగుతున్నాయి. ఈజిప్టు, సౌదీ అరేబియా వంటి అనేక దేశాలలో నిరంకుశత్వ రాజ్యాలు ఏర్పడ్డాయి. గత మూడు దశాబ్దాలుగా పశ్చిమాసియాలో శాంతి అత్యంత పెళుసుగా ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దలేని పరిస్థితిలో ఐక్యరాజ్యసమితి ఉంది. ఇజ్రాయిల్‌, పలస్తీనా సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి ఐరాస ప్రయత్నించింది. సిరియాలో అంతర్వ్యుద్దం, యెమెన్‌లో సంఘర్షణ పరిష్కారం కాకుండా ఐరాస మండలిలో అమెరికా వీటో అధికారాన్ని ఉపయోగించుకుంటున్నది. సిరియాలో అస్థిరతను, కాల్పుల విరమణను సాధించి శాంతిని నెలకొల్పే అవకాశం ఐరాసకు లేదు. అమెరికా, ఇతర పశ్చిమరాజ్యాల వైమానిక దాడులతో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. సంఘర్షణలకు మూలకారణాన్ని ఐరాస పరిష్కరించడంలో విఫలమైంది.
గాజాపైన దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసిజే) తీర్పుచెప్పింది. అమెరికా, ఇతర కీలకరాజ్యాలు సంఘర్షణలు, యుద్ధాలు జరగకుండా నిరోధించి శాంతిని నెలకొల్పేందుకు ముందుకు రావడంలేదు. అమెరికా, నామ మాత్రంగానే కాల్పులు విరమించాలని ఇజ్రాయిల్‌ను కోరుతోంది. అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ పలస్తీనా ప్రజలపై దాడులుజరిపి వేలాదిమందిని హతంచేస్తూ వస్తోంది. జాతులమధ్య విభజనను దశాబ్దాలుగా నిర్వహిస్తూనే ఉంది. 2023లో దక్షిణాఫ్రికాను ఇజ్రాయిల్‌ జాతివివక్ష రాజ్యమని విమర్శిస్తోంది. దౌత్యపరంగా, సాంఘికపరంగా ఇజ్రాయిల్‌కు అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటోంది. అత్యధిక ప్రపంచ దేశాలు ఐరాసలో గాజాపై కాల్పుల విరమణ జరగాలని చేసిన తీర్మానాలకు మద్దతు తెలిపాయి. పలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఖండిస్తూ అనేక దేశాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. గాజాపై దాడులను నిలిపివేయాలని ఐరాసలో అనేక తీర్మానాలను వివిధ దేశాలు నిర్ణయించాయి. వాషింగ్టన్‌్‌ ఇజ్రాయిల్‌పై ఆంక్షలను నిరంతరం అడ్డుకుంటూనే ఉన్నది.
అనేకమంది విశ్లేషకులు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడిరదని వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనల ఆధారమైన ప్రపంచవ్యవస్థను, ఐక్యరాజ్యసమితి చట్రాన్ని అంతర్జాతీయ చట్రాన్ని అమెరికా, ఇజ్రాయిల్‌, నాటోలు కలిసి బహుళత్వాన్ని నాశనం చేస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత సూత్రాలను, ప్రపంచ పరిపాలనను గౌరవించడంలేదు. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఉమ్మడి భద్రత భావనను నెలకొల్పాయి. సార్వభౌమత్వాన్ని గౌరవించాయి. అనంతరకాలంలో చట్టాన్ని వ్యవస్థ ఫ్రేమ్‌వర్క్‌ను శక్తిమంతమైన దేశాలు ప్రత్యేకించి అమెరికా దాని మిత్రదేశాలు ఏకపక్షంగా ఎంపికచేస్తున్న దేశాలలో జోక్యం చేసుకుంటున్నాయి. బహుళత్వ వ్యవస్థలను నాశనం చేసేందుకు అమెరికా కీలకమైన పాత్ర వహించింది. ఐరాస భద్రతామండలిలో అత్యధికసార్లు వీటోను ఉపయోగించి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. సైనిక కార్యాచరణను దేశ సార్వభౌమత్వ సూత్రాలను ఉల్లంఘిస్తూ ఐక్యరాజ్యసమితి చాప్టర్‌లో పేర్కొన్న శాంతి సూత్రాలనుసైతం ఖాతరు చేయడంలేదు. పలస్తీనాను ఆక్రమించిన ప్రాంతాలలో శాశ్వత ఆక్రమణలను కొనసాగించేందుకు ఇజ్రాయిల్‌ ప్రయత్నిస్తున్నది. ఈ చర్యలను అమెరికా దాని మిత్రదేశాలు సమ్మతిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అమెరికా చర్యలను ఖండిస్తూ ఐరాస తీర్మానాలు చేసింది. ఇజ్రాయిల్‌పైన గణనీయంగా ఎటువంటి ఒత్తిడులు జరగకుండా అమెరికా అడ్డుపడుతోంది. 2011లో లిబియాలో అమెరికా జోక్యం చేసుకుని ఐరాస ఫ్రేమ్‌వర్క్‌ను దగజార్చింది.
ప్రపంచ వేదికపైన శాంతి, సమానత్వం, న్యాయం నెలకొల్పాలని భారతదేశం ప్రముఖంగా ప్రతిపాదించింది. వలసవాద వ్యతిరేకత, స్వీయ రక్షణ, ప్రపంచ వ్యవస్థలో మరింత సమానత్వం కావాలని చేసిన పోరాటంలో అలీన ఉద్యమం కీలకపాత్ర వహించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలమధ్య సార్వభౌమత్వం, పరస్పరశాంతి, సంఫీుభావం కోరుతూ అనేక దశాబ్దాలు భారతదేశం విదేశాంగ విధానాన్ని పాటించింది. విశిష్ట హోదాను కలిగిన భారతదేశం ప్రపంచంలో దక్షిణ ప్రాంతంలో స్వతంత్ర ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య నాయకత్వాన్ని సమర్థించింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలలో దక్షిణాఫ్రికాలో జాతివివక్ష వ్యతిరేక సూత్రీకరణ భావనకు కట్టుబడిఉంది. విముక్తి ఉద్యమాలకు అండగా నిలిచింది. అయితే ఇప్పుడు పలస్తీనాకు మాటమాత్రంగా మద్దతు తెలిపింది. గతంలో కాల్పుల విరమణకు ఆయుధాల ధ్వంసం వలసపాలనలో మగ్గుతున్న ప్రజల హక్కులకు మద్దతు అన్ని విధాలుగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకతను తెలుపుతూ భారతదేశం తమ విదేశాంగ విధానాన్ని పాటించింది.
2014లో బీజేపీ నాయకులు నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చింది. ప్రత్యేకించి అమెరికా, ఇజ్రాయిల్‌ పట్లసంబంధం విషయంలో అంతకుముందు ఉన్న విధానంలో తీవ్రంగా మార్పులు చేసింది. అమెరికా, ఇజ్రాయిల్‌ పట్ల మోదీ ప్రభుత్వం పూర్తి అనుకూలతను పాటిస్తున్నది. గతంలో పలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు భారతదేశం సంపూర్ణంగా సహకరించింది. పలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను గతంలో సుదీర్ఘకాలంగా ఖండిస్తూనే వచ్చింది. మోదీ ప్రభుత్వం సైనికసహకారంతో సహా ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. దాదాపు సంవత్సరానికిపైగా గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులను ఖండిరచకుండా మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో తాము కీలకపాత్ర వహిస్తున్నామని నరేంద్రమోదీ, బీజేపీలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రపంచ దేశాలలో సంఘర్షణలను నిలువరించేందుకు ప్రయత్నించడంలో భారత్‌ ఘోరంగా విఫలమైంది. చిన్నవి, పెద్దవి అయిన అన్ని దేశాలు ఒకే ప్రమాణం కలిగి ఉండాలని నియమ నిబంధనల ఆధారంగా అంతర్జాతీయ వ్యవస్థ నెలకొనాలని మరింత న్యాయమైన, శాంతియుతమైన ప్రపంచ సమాజం నెలకొల్పేందుకు ఆధిపత్యంకల దేశాలు, ఇతర దేశాలు కలిసికట్టుగా పనిచేయవలసిన అవశ్యకత ఎంతైనాఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img