London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రజాస్వామ్యం అడ్రసు ఎక్కడ

నేను లేను నేను బతికున్న శవాన్ని నా బతుకంతా చీకటి గదిలోనె రా బావ ఏంటి ఈ రోజు మరీ వినకూడని మటలతో వస్తున్నావు ఏ మయిందయ్యా నీకు. ఏం కావాలయ్యా ఇప్పుడు మనం బతికున్న శవాలం. అసలు మనకు మాటలు ఎందుకు నేర్పారా అని బాధపడు తున్నా. మనసులోని మాట బైటపెట్టడానికి వీలు లేదు. తెగించి బైటపెడితే జైలులో ఊసలు లెక్కపెడుతూ కూర్చోవాలి. ఏమో నాకైతే స్వాతంత్య్రం ఎందుకు తెచ్చారయ్యా అని గాంధీ, నెహ్రూలను అడగాలని పిస్తోంది. ఏది ఏమైనా బ్రిటీషువారి పాలన మెరుగనిప్తోంది. మరీ అంత డీలా పడిపోతావేమయ్యా. ఆనాడు గాంధి, నెహ్రూలే కాదు ఆనాటి కమ్యూనిస్టులూ స్వాతంత్య్ర సంగ్రామంలో ఉన్నారు. అయినా ప్రస్తుత పాలకులు అప్రజాస్వామ్య పద్ధతులపై పిడికిలి బిగించి పోరాడాలి. అంతేగాని, స్వాతంత్య్రం వద్దనడం పొరపాటు. ప్రజా స్వామ్యంలో ప్రతిపాలకుడికి భావ స్వాతంత్య్రం ఉండాలి. మాట్లాడే హక్కు ఉండాలి. మనసులోని మాట బైటపెట్టి ప్రశ్నిచే హక్కు ఉండాలి. కాని నేడు పాలకులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ ఇప్పుడున్న చట్టాలు చాలక కొత్తగా నేరచట్టాల కోసం బీజేపీ సభలో బిల్లుపెట్టబోతోంది.
అదేనయ్యా నేననేది ఇపుడే మాట్లాడే హక్కు లేదు. ఇక కొత్త చట్టాలు రూపొందించి మాట్లాడేవారి వెంట, పోరాడే వారి వెంట ఉన్నవారిని కూడా జైలుపాలు చేసే దుర్మార్గపు ఆలోచనలకు ప్రధాన పాలకుడు తెరదించుతున్నాడు. మరి ఇప్పుడు చెప్పు బావ. నేను బతికున్నానా చనిపోకపోయినా బతికున్న శవాన్ని కదా. నిజమేనయ్యా ప్రస్తుతం బీజేపీ పాలన మరీ రాచరిక పాలనను తలపిస్తోంది. హిందువుల పేరిట అరాచకపాలనతో ప్రతిపక్షం గొంతు నొక్కుతోంది. మనం హిందువులం మనమే పాలించాలి. భారతదేశంలో మనమే ఉండాలి. ఇతర మతస్థులకు స్థానంలేదు అనే ఆర్‌ఎస్‌ఎస్‌ వారి గొంతు పాలనలో వినిపించేటట్లుగా బీజేపీ పాలన సాగుతోంది. హిందు దేవుళ్ల పేరిట మత సహనం కోల్పోయి విధ్వంసం సృష్టిస్తున్నారని రాహుల్‌ గాంధీ అంటే శివున్నే తిడుతున్నట్లుగా ప్రజల ముందుకుతెచ్చి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బీజేపీ వారికి పాలించే హక్కు లేదు బావ. నాకొకమాట గుర్తు కొస్తోంది. ఒకసారి సభలో కడుపుమండి ఖడ్గే ఒక మాటన్నాడు. అసలు స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ నెహ్రూ ప్రాణాలర్పించారు కాని బీజేపీ వారి యింట ఒక కుక్కయినా చచ్చిందా అన్నాడు. నిజమే ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్‌ తప్ప బీజేపీ పార్టీ లేదు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను సపోర్టు చేసినవారికి భారతదేశాన్ని పాలించే హక్కు లేదు. అయినా హిందుత్వంతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కి ఈనాడు రాజ్యాంగం ఇచ్చిన వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించి రాజుల వలె పాలించడం ఎంతో దుర్మార్గం. అది సరే ప్రస్తుతం అధికారం ముఖ్యమన్నట్లుగ అవకాశ అవసరాల పాలన సాగుతోంది. గతంలో సరిపోయి నంత మెజారిటీ వచ్చింది కనుక అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను తిప్పుకొని అడిగినవన్నీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తప్పనిసరి పరిస్థితిలో జగన్‌ వారికి ఉభయసభల్లో సపోర్టు ఇచ్చి తిరిగినా నిధులు రాల్చకుండా నిర్దాక్షిణ్యంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం వారికి తగినంత బలం లేకపోవడంతో చంద్రబాబును కౌగిలించుకుని వీపు తట్టి లాలిస్తున్నారు. నిజమే ఇది అవకాశవాద రాజకీయ మేగా. అందులో అనుమాన మేముంది. అ విషయంలో మన ముఖ్యమంత్రి ఒకసారి బీజేపీ, మరొకసారి కాంగ్రెసును దూరం పెట్టాడు. అటు మోదీ ఇటు బాబు ఇప్పుడు అవకాశవాదులే అనిపిస్తోంది. అదంతా గతం కాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేకహోదా తెస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. కాని గతంలో రాష్ట్రం విడదీసే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం హోదా ఇచ్చే పరిస్థితిలో ఉన్నా చంద్రబాబు హోదా కోసం పట్టుపట్టకుండ ప్యాకేజీకి ఒప్పుకోవడం వలన రాష్ట్రం నష్టపోయింది. ఇప్పుడు క్లిష్టపరిస్థితిలోనైనా ప్రత్యేక హోదా అడగాలి. ప్రస్తుతం హోదా రాష్ట్రానికి సంజీవిని లాంటిది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధు లందరు హోదా కోసం పోరాడవలసిన అవసరం ఉంది. అది సరేగాని కేవలం నిధుల కోసం నియంతపాలన సాగించే బీజేపీ వెంటబడి వారి కాళ్లకు మొక్కడం సరికాదు. ఇటువంటి పరిస్థితులలో వారిని అంట కాగడం కంటే జాలిపడతానన్న ఎన్‌టిఆర్‌ మాటలు గుర్తుతెచ్చుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img