Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

భయం! భయం!

చింతపట్ల సుదర్శన్‌

కడుపు నిండగానే కునుకుపట్టడం సహజం మనుషులకే కాదు నాలాంటి వీధికుక్కలకి కూడా అనుకుంటూ రోడ్డు పక్క చెట్టుకింద ఒళ్లు పారేసి కళ్లు మూసేసుకుంది డాగీ. చీకూచింతా లేకుండా నిద్రపోయే రోజులా ఇవి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, సీటు కోసం పడిగాపులు పడేవాళ్లకు, చెప్పుల్లోనే కదా కాళ్లు, ఎక్కే విమానం దిగే విమానం కదా రోజులు. రోజులా ఇవి ‘డర్టీ డేస్‌’. పార్టీ మారేవాళ్లకు, మారకపోతే ‘షాక్‌’లు, షాక్‌ల మీద షాక్‌లు. అయితే మన డాగీకి మాత్రం ఏ చింతా లేదు కనుక కన్ను మూయగానే స్వప్నలోకాల్లో విహరించసాగింది.
ఉన్నట్టుండి ఓ బుల్లెట్‌ బైక్‌ ‘పర్జన్య శంఖమ్ము’ పూరించుకుంటూ వెళ్లిపోవడంతో ఉలిక్కిపడి లేచింది డాగీ. భయంతో వళ్లు వణికింది. ఏ యాక్సిడెంటు, ఎందుకు జరుగునో, ఏ విధమున జరుగునో ఎవ్వరెరుగుదురు అనుకుంటూ కొంచెం చెట్టు వైపుకి జరిగి మళ్లీ కనులు మూయబోయింది కానీ భయంతో వొణికిపోవాల్సిన పరిస్థితి మరొక్కసారి ఎదురైంది. ఓ సైకిలు చక్రం దాదాపు తోకమీది నుంచి వెళ్లిపోబోయింది. ‘తోకే’ కదా అని తొక్కిపోతే ప్రాణం విలవిలలాడేది అనుకున్న డాగీని భయం నిలువెల్లా కమ్ముకుంది. జానా బెత్తెడు దూరం నించి ముందుకు తిరిగిపోయిన సైకిలు చక్రం వేపు గుడ్లప్పగించి చూస్తుండిపోయిన డాగీ లేచి నిలబడిరది. ఒళ్లు దులుపుకుంది కానీ ఒంట్లో నుంచి భయాన్ని దులిపేయలేకపోయింది.
రోజులసలు బాగాలేవు. మనుషులకే కాదు మనకు కూడా అనుకుంటూ, నిద్రా కార్యక్రమానికి వందన సమర్పణ చేసి కొంప చేరుకోడానికి అడుగులు కదిలించింది డాగీ. దారిలో అరిచిగీపెట్టే బైకుల్నీ, చడీ చప్పుడూ లేకుండా మీదిమీదికి వచ్చే సైకిలు చక్రాలనీ తప్పించుకుంటూ భయంభయంగా అరుగు దగ్గరికి చేరుకుంది. అప్పటికే అరుగుమీద ఉన్న గాడిద, డాగీ నడకలో తేడా కనిపించి అరుగుదిగి ఎదురు వచ్చింది ఏం జరిగిందోనని ఆందోళనపడుతూ!
అంత భయంలోనూ నవ్వొచ్చింది డాగీకి ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంపుచేసే వాడికి కండువాతో ఎదురొచ్చిన నాయకుడిలా వస్తున్నదే డాంకీ అనుకుంది. ఏమైంది ‘డాగీ బ్రో’ తోక వెనుక కాళ్లల్లో ఇరికించుకు వస్తున్నావ్‌ అంది డాంకీ. చెప్తాను పద అంటూ అరుగెక్కింది డాగీ, పాలో అయింది డాంకీ.
అరుగు మీద గోడకు ఆనుకుని కూర్చుని, ఇప్పుడు కొంచెం భయం తగ్గింది అంది డాగీ. భయమా దేనికోయి గ్రామ సింహానివికదా నువ్వు అంది డాంకీ పళ్లికిలిస్తూ. జోకులొద్దు. బైకు కింద నేనో, సైకిలు చక్రం కింద నా తోకో నలిగిపోయేవి ఇవాళ. భయంతో ఇంకా వొళ్లు ‘షివరింగ్‌’ అవుతున్నది. భయమా సారీ నిజంగానే భయం అయితే మరొక్కసారీ అంది డాంకీ. గ్రామ సింహాన్నైన నాకే కాదు రాష్ట్రాలని ఏలేవాళ్లు కూడా భయంతో వణికిపోతున్న రోజులివి. అసలు అన్నిరసాల కన్నా ‘భయ’ రసమే ప్రవాహంగా పారుతున్నట్టున్నదీ నేలమీద అంది డాగీ.
అవును నిజమే అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. ఏది సత్యం? ఏదసత్యం? అన్నది డాంకీ. భయమే సత్యం భయమే నిత్యం భయమే సర్వం అన్నాడబ్బాయి. నిజమే భయమే భయం అంది డాగీ బుల్లెట్‌ గాండ్రిరపు గుర్తు చేసుకుంటూ. బతిమాలే రోజులు పోయినయి. బుజ్జగింపులు కరువైనవి. ఇప్పుడంతా ‘భయం భక్తీ’ యివే రాజ్యం చేస్తున్నవి అన్నాడబ్బాయి.
తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది అన్నాడు కదా కవి గజ్జెల మల్లారెడ్డి కాకపోతే తెలుగునాట దగ్గర ‘దేశం’ పేరు చేరిస్తే సరి అంది డాంకీ. దొంగతనం కాదు, దోపిడీ కాదు భక్తిరసం పొంగించి, ఉప్పొంగించి ఓట్లు కొల్లగొట్టడం, ఆ రెంటికీ మించి అంది డాగీ. ఏలినవారు ‘సవ్యసాచులు’ కదా ఓ చేత భక్తి మరో చేత భయమూతో ‘జోరు జబర్దస్తీ’ చూపుతున్నారు. మంత్రులైతేం, రాష్ట్రాల ముఖ్య మంత్రులైతేనేం, ఊచలు లెక్కపెట్టి వచ్చిన వారైతేనేం, లెక్కపెట్టాల్సిన వారైతేనేం అందరి జుట్టూ చేత పట్టుకుని వీరంగం చేస్తున్నారు. ఈడీ దాడులూ, ఐటీ దండయాత్రలు, సీబీఐ నోటీసులు ఇవి కదా భయంతో క్షణం క్షణం నరకయాతన పెట్టేవి. ఒకనాటికి తేలనివి. ముంచడం పైకెత్తడం, మళ్లీమళ్లీ ముంచి భయపెట్టడం అన్నాడబ్బాయి.
సంవత్సరాల కొద్దీ బెయిళ్లు, సహస్రాల కొద్దీ వాయిదాలు భయం మాత్రం టీవీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉండడం వారెవ్వా క్యాసీన్‌హై అంది డాంకీ. చీకటి పడ్తున్నది ఏ వాహనం ఎక్కడ్నించి వచ్చి గుద్ది చంపుద్దో తెలీదు. బ్రదర్‌ వెలుతురుండగానే వెళ్లిపో అంది డాగీ తోకని వెనుక కాళ్ల మధ్య అడ్జస్టు చేసుకుంటూ.
కరెక్టు! మనం దేనికీ భయపడకపోయినా భయానికి మాత్రం భయపడక తప్పదు అంటూ అరుగు దిగాడు అబ్బాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img