London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

రాజకీయాల్లో కీలకమైన గోవు

రామ్‌ పునియాని

దేశ రాజకీయాల్లో గోవును దాదాపు మూడు దశాబ్దాలుగా భావోద్వేగ సమస్యగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు, గోవు పవిత్రమైందిగా ప్రచారం సాగిస్తున్నారు. అనేకమంది గోవుకు తల్లి హోదా ఇస్తున్నారు. మన సమాజాన్ని విభజించడానికి గోవుకు, హిందు జాతీయ రాజకీయాల్లో గోవును కత్తిమొనగా ఉపయోగించుకుంటున్నారు. హిందు సిద్ధాంతకర్త సావర్కర్‌ హిందుత్వను హిందూ మతంగానే కాదు, మొత్తం హిందూతత్వంగా తెరపైకి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయాలను రూపొందించుకుని హిందు రాష్ట్రను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు శతాబ్దికాలంగా అవిశ్రాంతంగా హిందు రాష్ట్ర ఏర్పాటుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలను భావోద్వేగ సమస్యలుగా సృష్టిస్తూ, దేశంలో రాజకీయ రంగంలో ఆధిపత్యం సాధించింది. అవిశ్రాంతంగా పనిచేస్తూ 2024 అక్టోబరు నాటికి మరింత ప్రముఖంగా తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ (కేవలం దేశంలో పుట్టినఎక్కువగా మాట్లాడుకునే దేశీయమైనదనిగా పరిగణించే) గోవును రాజ్యమాతగోమాతగా ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఈ నినాదాన్ని ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఎక్కువమంది బీజేపీ గెలిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఇటీవల లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ నేపధ్యంలో ప్రజల మధ్య విభజనను ఏర్పాటు చేసేందుకు గోమాత నినాదాన్ని తీసుకువచ్చారు.
హిందు జాతీయ సిద్ధాంకతకర్త సావర్కర్‌ గోవును వధించడం వ్యతిరేకించరాదని, అంతేకాదు అది పవిత్రమైందని, ఉపయోగకరమైనదేనని చెప్పారని ఇటీవల కర్నాటక మంత్రి ఒకరు చెప్పారు. ‘‘బెంగుళూరులో గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దినేశ్‌గుండూరావు మాట్లాడుతూ, సావర్కర్‌ మీట్‌ను మాత్రమే కాదు, బీఫ్‌ను తినేవారని, బహిరంగంగా ఈ విషయాన్ని ప్రచారం చేశారు’’ అని తెలిపారు. కాంగ్రెస్‌ మంత్రి దినేశ్‌ గుండూరావు ఇంకా ఇలా చెప్పారు. ‘‘సావర్కర్‌ బ్రాహ్మణుడైనప్పటికీ, సంప్రదాయమైన ఆహార నియమాలను పాటించలేదని ఆయన ఆధునికుడైన బ్రాహ్మణుడు బీఫ్‌ తినేవాడు, శాఖాహారికాదని అన్నారు. గోవును వధించినప్పటికీ వ్యతిరేకించలేదు. వాస్తవంగా ఆయన ఆధునికుడు. ‘‘సావర్కర్‌ మీట్‌ తింటారని అందరికీ బాగా తెలుసు. లండన్‌లో గాంధీ సావర్కర్‌ను కలిశారు. దక్షిణాఫ్రికాలో గాంధీ కార్యకలాపాలకు సావర్కర్‌ మద్దతు తెలిపారు. అప్పుడుకూడా సావర్కర్‌ను గాంధీ కలిశారు. అప్పుడు సావర్కర్‌ డిన్నర్‌ను తయారు చేస్తున్నారు. ఆయన రొయ్యలను వేయించి గాంధీకి వాటిని ఇచ్చారు. అయితే గాంధీ తాను సంపూర్ణ శాఖాహారినని చెప్పారు.
గోవును పూజించనవసరంలేదని కూడా సావర్కర్‌ చెప్పారు. రచయిత వైభవ్‌ పురందరె ఇలా పేర్కొన్నారు. గోవు కేవలం ఎద్దుకు మాత్రమే తల్లి అన్నారు. అయితే బీఫ్‌ను తిన్నట్లు రికార్డు లేదని, అయితే బీఫ్‌ను తినడాన్ని తాను వ్యతిరేకించలేదని రచయిత తెలిపారు. అయితే నిజంగా తనను హిందుత్వ పిత అన్నారని బెంగుళూరులో జరిగిన పుస్తక మహోత్సవంలో అన్నారు. పురందరె ఇంకా ఇలా అన్నారు. గోరక్షణ విషయాన్ని సావర్కర్‌ సంక్లిష్టం చేశారు. హిందువులను ఎగతాళి చేసేందుకు కావాలని గోవులను చంపడం సమస్య అయ్యేదని సావర్కర్‌ చెప్పారని అన్నారు. తినడానికి గోవును చంపినా ఇబ్బందిలేదని సావర్కర్‌ అన్నారని రచయిత అన్నారు. వేదకాలంలో గోవులను యజ్ఞాలలో బలి ఇచ్చేవారని, ఇది పవిత్రమని రచించారు. స్వామి వివేకానంద తాను రచించిన పుస్తకాలలో పవిత్రమైన క్రతువులలో గోవును బలి ఇచ్చేవారని, తినడం కూడా నిషేధంకాదని పేర్కొన్నారు. ప్రాచీన కర్మకాండ క్రతువులలో బీఫ్‌ తినని వ్యక్తి మంచి హిందువుకాదని భావించేవారని నేను చెపితే మీరు ఆశ్చర్యపోతారని వివేకానందుడు రాశారు. కొన్ని పవిత్ర సందర్భాలలో తప్పనిసరిగా గోవును బలిఇచ్చి తినాల్సి వచ్చేదని వివేకానందుడు పేర్కొన్నారు. అమెరికాలో (1900 ఫిబ్రవరి 2న) కాలిఫోర్నియా షేక్సిపియర్‌ క్లబ్‌లో వివేకానందుడు మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు.)
స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్‌ స్పాన్సర్‌చేసిన ఇతరపరిశోధనా గ్రంధాలలోనూ ఈ అంశాలను బలపరిచారు. అందులో ఒక పుస్తకంలో ఇలా ఉంది. వేద కాలంనాటి బ్రాహ్మణులతో సహా ఆర్యులు, చేపలు, మాంసం చివరకి బీఫ్‌ కూడా తినేవారు. ముఖ్య అతిధి భోజనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా బీఫ్‌ను వడ్డించేవారు. వేదకాలంనాటి ఆర్యులు బీఫ్‌ తిననప్పటికీ పాలిచ్చే గోవులను బలిఇచ్చేవారు కాదు. ఎద్దులు, పెద్దవైన గోవులు, వాటి బిడ్డలను కూడా వధించేవారు. అంబేద్కర్‌ అధ్యయనాలలోనూ ఇలాంటి అంశాలనే పేర్కొన్నారు. ప్రాచీనకాలంనాటి చరిత్రకారులు ఫ్రొఫెసర్‌ డి.ఎన్‌.రaా తన పరిశోధనా రచనలలోనూ గో పవిత్రత అనేది కల్పనేన్నారు. గోమాత అని హోదాను కల్పించడంపై బౌద్ధం, బ్రాహ్మణిజం మధ్య పోరాటం జరిగింది. భారతదేశంలో బుద్ధిజం దాదాపు అంతరించిపోయిన తర్వాత బౌద్ధంపై బ్రాహ్మణిజం దాడులు చేపట్టింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ముస్లిం, హిందు మత రాజకీయాలు ఉద్భవించాయి. తమను తాము బలపేతం చేసుకునేందుకు రాజకీయ ధోరణులను అనుసరించి పంది మాంసాన్ని, బీఫ్‌ను వినియోగించారు. మత హింసను ప్రేరేపించేందుకు ఫోర్క్‌ను మసీదులలోను, బీఫ్‌ను దేవాలయా లలోను వేసేవారు. హింసను ప్రేరేపించేందుకే కావాలని ఆలయాలలో బీఫ్‌ను వేసేవారు. అఖ్‌లఖ్‌ నుంచి జునాయిడ్‌ వరకు గోవధను నిషేధించినట్లు వెలుగుచూడడంతో రఖ్‌బర్‌ ఖాన్‌ను చంపి వేశారు. ఆకాలంలో ముస్లింలు, హిందువుల మధ్య గొడవలు గరిష్టస్థాయికి చేరాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దేశీయ గోవులను మాత్రమే రాజమాతగా పిలుస్తున్నారు. ఇతర గోవులను అలా పిలవడంలేదు. భారతదేశం నుంచి బీఫ్‌ను ఎగుమతి చేయడం క్రమంగా గరిష్టస్థాయికి చేరింది. రచయిత విజయ్‌ త్రివేది (వాజ్‌పేయి మీద) రచించిన పుస్తకంలో వాజ్‌పేయి అమెరికా వెళ్లిన సందర్భంలో (పేజీ:236) బీఫ్‌ను తిన్నారని పేర్కొన్నారు. అయితే భారతదేశ గోవును తాను తినలేదుకదా అంటూ వాజ్‌పేయి నవ్వారని, ఇంక సమస్య ఎక్కడుందని ప్రశ్నించినట్లు త్రివేది తన పుస్తకంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img