London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

వైరాగ్యం

చింతపట్ల సుదర్శన్‌

ఉన్నట్టుండి డాగీ అరుపులు లంకించుకోడంతో నిద్రపోతున్న డాంకీ ఉలిక్కిపడి లేచింది. అరుగు అనుకుందా, అసెంబ్లీ అనుకుందా అని విసుక్కుంటూ లేచి నిలబడ్డది. తను కూచున్న చోటే నిలబడి, తోక తిప్పుతూ గొంతు చించుకుంటున్నది డాగీ. కింది మెట్టు మీద ఓ మానవ మాత్రుడు నిలబడి ఉన్నాడు. ఆ మనిషిని అరుగు ఎక్కనీయరాదని బహుశా డాగీ అరుస్తున్నదేమోననుకున్న డాంకీ, ఆ నరమానవుడివైపు పరిశీలనగా డాంకీ చూసింది. మనిషి బక్కపలచగా ఉన్నాడు. సాదాసీదా దుస్తులున్నాయి. కాకపోతే తలమీద జుట్టు నాలుగైదు పిట్టలకు సరిపోయే విశాలమైన గూడులా ఉంది. గడ్డం పొడుగ్గా సాగి ఉంది. దాంట్లో మమేకం అవడం వల్ల మీసాలు కనిపించడంలేదు. సన్నాసులకూ, దొంగలకూ తేడా తెలీదు ఈ ‘స్పీకింగ్‌ డాగ్‌’ కి అనుకుంటూ ఏయ్‌ డాగీ ఎవరో సన్యాసిలా ఉన్నాడు. కాసేపు మన ఈ కూలిన కొంపలో ‘రిలాక్సవు’ దామని వచ్చాడేమో రానీరాదూ. అరవడం ఆపి అసింటా పోరాదూ అంది డాంకీ.
ఇదే డాగీకి, డాంకీకి ఉన్న ‘డిఫరెన్స్‌’. దొంగలని గుర్తుపట్టే ‘స్పెషల్‌ సెన్స్‌’ ఇచ్చాడు మన ‘మేకరు’ కుక్కలకి. జనం వేషం చూసి మోసపోతారు. గడ్డాలూ, జుత్తూ పెంచుకున్నోళ్లందరికీ, మహిమలు ఉంటాయనుకుంటారు. వాళ్లు సర్వసంగ పరిత్యాగులని భ్రమపడతారు. మాకు, ఏ వేషం వెనుక ఏ దొంగ దాక్కున్నాడో ఇట్టే తెల్సిపోతుంది. అరుగు ఎక్కబోతున్న ఈ సన్యాసిరావు మన పాత కొంపలో గంజాయి దమ్ము కొట్టడానికే వస్తున్నాడో, రాత్రికి కాలనీలో ఏ కొంపకు అయినా కన్నం వెయ్యడానికే వస్తున్నాడో ఎవరికెరుక. నాకు తెలీక అడుగుతున్నాను. ఈ మనిషి నెత్తిన పిట్టగూడు, గజిబిజి గడ్డమూ నిజంగా నిజమైనవేనంటావా? పీకితే వూడి వస్తాయో రావో చూడమంటావా? అంది డాగీ. ఆ పని మాత్రం చెయ్యకు. అవి నిజమైనవే అయితే లబోదిబోమంటాడు. ఆ పాపం మనకెందుకు చెప్పు. గంజాయి దమ్ము కొట్టేవాడయితే కాస్సేపు పొగ మేఘాలు వదిలేసి చక్కాపోతాడు. నిజం సన్యాసి అయితే లోపల ఓ గదిలో కూచుని లక్ష్మణ్‌దేవ్‌ బాబాలా కాస్సేపు మెడిటేషన్‌ చేసుకుపోతాడు. అనవసరంగా అరిచి పొగబెట్టి పొమ్మనకు. లివ్‌ అండ్‌ లెట్‌ అదర్స్‌ లివ్‌, అన్నది మనుషులు పట్టించుకోరు కానీ మనం పట్టించుకుందాం. జంతు హక్కులు ఉన్నాయని వాళ్లనుకోరు కానీ మానవ హక్కులు ఉంటాయని మనం పట్టించుకుందాం అంది డాంకీ. నువ్వింత చెప్పేక ఏం చేస్తాను, తోక ముడుస్తాను అంటూ డాగీ అరుపులు ‘విత్‌ డ్రా’, చేసుకుని తన జాగాలో కూచుంది.
కుక్క భౌభౌలు విని అరుగు ఎక్కాలా వద్దా అని ‘డవుటు’ పడుతున్న మనిషి అది గమ్మున ఉంటంతో ధైర్యం వచ్చి అరుగు ఎక్కాడు. తమరు ఎవరు స్వామీ? ఇలా వచ్చి మా ఈ శిథిల గృహాన్ని పావనం చేస్తున్నారు అంది డాంకీ. మనుషుల భాష తెల్సిన ఓ గాడిదా, ఓ కుక్కా ఈ ఊళ్లో ఉన్నాయని కర్ణాకర్ణీగా విన్నాను. నిజమేనన్న మాట, వాట్సప్‌ గ్యాసు కాదన్న మాట అన్నాడు సన్యాసుడు ఆశ్చర్యంగా.
ఏదో ఈ రంగస్థలం రాస్తున్న సుదర్శన్‌గారి చలవ. అది అలా ఉంచండి. తమరి రాకకు కారణమేమిటి? ఈ కూలిన కొంపలో మీకు సౌకర్యంగా ఉండదు స్వామీ. పాద పూజచేసి నీళ్లు నెత్తిన జల్లుకునే భక్తుల ఇండ్లకు పోవచ్చు గదా అన్నది డాంకీ. నువ్వు మరీ చెప్తావు. గంజాయి దమ్ము కొట్టే వాడెవడన్నా భక్తుల కొంపలకు పోతాడా, కూలిన కొంపల్లో దూరుతాడు కానీ అంది డాగీ. నో…నో…నేనలాంటి వాడ్నికాను. బాగా బతికిన వాడ్ని. బతికి చెడినవాణ్ణి కూడా కాను. నేను నమ్మిన ప్రజలు నన్ను నట్టేట్లో ముంచేస్తే తప్పనిసరై ఓ అయిదేళ్ల ‘ఇంటర్వెల్‌’ ఇవ్వక తప్పింది కాదు. ఈ లోపల ఓ అయిదేళ్లు. అలా కళ్లు మూసుకుని ఉంటే చాలునని, ఈ వేషం ధరించా అన్నాడు స్వామీజీ వేషంలో వచ్చిన స్వామీజీ కాని మనిషి. అర్థమైంది ఎన్నికల్లో జనం సీట్లోంచి కిందికి తోశారన్న మాట. అయనెవరో ముక్కు నేలకురాసి మూడు ఇంచీలు అరిగించాలన్నది తమరినేనా అంది డాంకీ. కాదు కాదు నాలాగే ఆయనకూ గ్రహాల మైత్రి సరిగ్గా లేదనుకుంటా. నేను మాత్రం హిమాలయాలకు వెళ్లి కళ్లు మూసుకుని తపస్సు చేద్దామనుకుంటున్నా. అందుకు ఈ మీ కూలిన కొంపలో ‘మెడిటేషన్‌’ ప్రాక్టీసు చేద్దామనుకుంటున్నా అంటుండగానే సెల్లు మోగింది. సెల్లులో మాట్లాడిన సన్యాసి ముఖం వికసించి, విప్పారి విస్తరించింది. ఈ కూలిన కొంపలో ఏదో మహిమ ఉంది. నేను ఓడిపోయిన మాట నిజమేకాని మా పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చేయంట. అంటే ప్రజలు మావైపే ఉన్నట్టు గదా! మళ్లీ ఎలెక్షన్లు రావా పోవా, మేం గెలవకపోమా? మెడిటేషన్‌ కాన్సిల్‌, హిమాలయాలు కాన్సిల్‌. ఈ గడ్డమూ, జుత్తూ పీకేస్తున్న అంటూ సన్యాసి వాటిని పీకి పారేసి వెళ్లిపోయాడు మెట్లు దిగి గబగబా.
శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాంటిదే నన్నమాట ‘ఎన్నికల వైరాగ్యం’ కూడా అన్నది డాంకీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img