Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

నేడు ఎస్సీడిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యుల రాక

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోగల శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలకు మంగళవారం నాడు రాష్ట్ర కాలేజీయేట్ కమిషనర్ డాక్టరు పోల.భాస్కర్ అదేశాలమేరకు త్రిసభ్య కమిటీసభ్యులు వస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు. తమకళాశాలకు నాక్ (జాతీయగుర్తింపు నిర్ధారణచేసే కౌన్సిల్) బృందం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో రానున్నందున ముందస్తుగా ఉన్నతవిద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు అమరావతినుండి డాక్టరు కె. విజయ్ బాబు (ఓఎస్డి), డాక్టరు జె. జాన్ కిరణ్ (అకాడమిక్ ఆఫీసరు), ఈ.వరప్రసాద్(అకాడమిక్ ఆఫీసరు) లు కళాశాలకు వస్తున్నట్లు చెప్పారు. వీరు కళాశాలను సందర్శించి నాక్ కమిటీ వచ్చే సమయానికి చేయాల్సిన పనులు,రికార్డులు, అకాడమిక్ విధానం, విద్యాప్రమాణాలు పెంచేందుకు తగు సూచనలు,కళాశాలలో మెరుగు పరచాల్సిన పలుఅంశాలపై, అకాడమిక్ కార్యకలాపాలు మెరుగు పరచడానికి సూచనలు సలహాలను అందిస్తారని తెలిపారు.కళాశాలలో భోధన సిబ్బందితో మాట్లాడి భోధనలో తీసుకోవాల్సిన అంశాలపై వివరిస్తారని తెలిపారు. భవిషత్ లో కళాశాలలో మెరుగుపరచాల్సిన అంశాలపై కూడా వివరిస్తారని తెలిపారు.కళాశాలలో భోధన సిబ్బందితో సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు ఎస్వీడిగ్రీ కళాశాల పర్యవేక్షణ అనంతరం పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం సందర్శన చేస్తారని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img