Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

డి.ఎస్సీ 98ఉపాధ్యాయుల ఆత్మీయ అభినందన సభ నిర్వహణ

విశాలాంధ్ర – సీతానగరం : డి.ఎస్సీ98 ఉపాధ్యాయ సిబ్బంది ఉత్తమ విద్యను అందించేందుకు కృషిచేసి విద్యార్థులలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారులు సూరిదేముడు, మువ్వల వెంకటరమణలు పిలుపునిచ్చారు.శుక్రవారం సాయంత్రం స్తానిక మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో డిఎస్సీ 98 ఉపాధ్యాయుల ఆత్మీయ అభినందన సభను జిల్లా అధ్యక్షులు పూడి శంకరరావు,కార్యదర్శి జి. దామోదరరావు, పెంట మోహనరావు, సిరికి మహేష్ ఆద్వర్యంలో నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులను, వివిధ ఉపాధ్యాయ సంఘాలనాయకులను వారు ఘనంగ సత్కరించారు. అందరి సహకారంతో,సూచనలు, సలహాలతో మెరుగైన బోధన పద్ధతులు పాటించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈకార్యక్రమంలో వివిద ఉపాధ్యాయ సంఘాల నాయకులు టి.గౌరునాయుడు, పోల సత్యనారాయణ, చప్ప ఈశ్వరరావు, పల్లి శ్రీనివాసరావు, రెడ్డి శంకరరావు, అరసాడ మోహనరావు, డి. ఎస్సీ 98ఉపాధ్యాయులు దొగ్గ మోహనరావు, వెంకటరమణ,శ్రీనివాసరావు,సంధ్యారాణి,త్రివేణి, భాస్కరరావు,సత్యనారాయణ తదితర ఉపాధ్యాయులతోపాటు సిఆర్పీలుఅనసూయ,గణేష్,రమేష్,దామోదర్, రతీ దేవి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img