Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అర్జెంటీనా విజయోత్సవం

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు సంబరాల్లో మునిగి పోయింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఖతార్‌లో అర్జెం టీనా ఆటగాళ్లు ఓపెన్‌ టాప్‌ బస్సులో విజయోత్సవ ర్యాలీ నిర్వ హించారు. మరోపక్క సుధీర్ఘకాలం తర్వాత దక్కిన గెలుపును అర్జెంటీనా వాసులు అస్వాదిస్తున్నారు. రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌ వీధుల్లో లక్షలాదిమంది వేడుకల్లో మునిగిపోయారు. కాగా ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఫైనల్‌లో అర్జెంటీనా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. ఫ్రాన్స్‌ ఆటగాడు కిలియన్‌ ఎంబప్పే హ్యాట్రిక్‌ గోల్స్‌తో పోరాడినా… ఫ్రాన్స్‌ను షూటౌట్‌ చేసిన లియోనెల్‌ మెస్సీ సేన… విశ్వవిజేత కిరీటాన్ని సొంతం చేసుకొంది. మెగా కప్‌పై 20 ఏళ్ల యూరోపియన్‌ ఆధిపత్యానికి లాటిన్‌ అమెరికా జట్టు ఎట్టకేలకు తెరదించింది. వరుసగా రెండోసారి నెగ్గి చరిత్రను తిరగరాయాలనుకున్న ఫ్రాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో అర్జెంటీనా 3-3 (4-2)తో ఫ్రాన్స్‌ను ఓడిరచి మూడోసారి ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది. అర్జెంటీనా తరఫున మెస్సీ (23, 108వ), డిమారియా (36వ) గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ తరఫున ఎంబప్పే (80, 81, 118వ) మూడు గోల్స్‌తో అదరగొట్టాడు. ఇక, షూటౌట్‌లో అర్జెంటీనా 4 స్కోరు చేయగా ఫ్రెంచ్‌ టీమ్‌ 2 కిక్‌లను మాత్రమే గోల్‌ పోస్టులోకి పంపగలిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img