London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

నీట్ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం

ఎన్ టి ఏ సంస్థను రద్దు చేయాలి

నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలి

ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
విశాలాంధ్ర -ధర్మవరం: నీట్ పరీక్షను రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ధర్మవరం పట్టణంలో విజయవంతం అవడం జరిగింది.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర ,ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి నిరంజన్ యాదవ్, ఎన్ ఎస్ యు ఐ గణేష్, ఏపీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శివ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నిట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలలో ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగంగా చెప్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు పని తెలిపారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని,అసెంబ్లీలో తీర్మాణ ప్రవేశపెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు అని, తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.నీట్ పరీక్షను నిర్వహించిన ఎన్ టి ఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని, పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేటువంటి పద్ధతులలో పేపర్ లీకేజీలు చేస్తున్న ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేస్తూ నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టిఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు నంద, కార్తిక్, పురుషోత్తం, , అస్లాం, బన్నీ ,విజయ్, యాసీన్, మురళి, సుకృత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img