విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) :ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన నిమ్మగంటి సుధాకర్ అనే యువ రైతు గురువారం తాను సాగు చేసిన 9 ఎకరాల మిర్చి బోదుల్లో ఎనిమిది గంటల్లోనే 172 సూట్లు సేద్యం పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా యువ రైతు సుధాకర్ ను గ్రామస్తులు అభినందిస్తూ ఘనంగా సన్మానించి గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెన్నహోబిలం ఆలయ మాజీ చైర్మన్ అశోక్ కుమార్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.