తాహసిల్దార్ ఎంపీడీవో
విశాలాంధ్ర,(శ్రీ సత్య సాయి జిల్లా)కదిరి.::: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ మురళీకృష్ణ ఎంపీడీవో పోలప్ప పేర్కొన్నారు.బుధవారం కౌలేపల్లి సమీపాన దేవర చెరువు, కుమ్మర వాండ్లపల్లి సమీపాన గల ఇటుక రాతి చెరువు మరవ ప్రాంతాన్ని పరిశీలించారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన ఎలాంటి ప్రాణనాస్తం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామ
న్నారు. ప్రజలు ఎవ్వరు వాగులు,వంకలు వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంభంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ మహేష్, పంచాయతీ కార్యదర్శులు కేథరనాథ్, మహేష్,శైలజ, నాగభూషణం పాల్గొన్నారు