London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 7, 2024
Monday, October 7, 2024

125 మంది మరణానికి కారణమైన బోలే బాబాను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి

డాక్టర్ ఆదిశేషు-జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధనకార్యదర్శి
విశాలాంధ్ర ధర్మ వరం:; 125 మంది మృతికి కారణమైన బోలె బాబాను వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిశేషు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ తొక్కిసలాటలో 125 మంది అమాయకులు బలయ్యారు అని, ఇందులో 12 మంది మహిళలు 8 మంది పిల్లలు ఉండడం బాధాకరమన్నారు. ఈ ఘాతకానికి బాధ్యుడైన భోలే బాబా అనే సూరజ్ పాల్ 28 ఏళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి లైంగిక దోపిడీకేసుల్లో నిందితుడుగా ఉన్నాడని, ప్రవచనాలు చెప్పడం నేర్చుకొని, తన గ్రామంలో ప్రారంభమై హత్రాస్ చేరి స్వయం ప్రకటిత దేవుడయ్యాడు అన్నారు. దేవుడు తనతో స్వయంగా మాట్లాడుతాడని భక్తులను నమ్మించాడని, మంచినీళ్ళతో సర్వ రోగాలను నయం చేయగలరని ప్రచారం చేయడం జరిగిందన్నారు.30 ఎకరాల్లో ఉన్న తన ఆశ్రమంలో సేవాదళ్ పేరుతో సొంత సైన్యాన్ని నిర్మించు కోవడం జరిగిందన్నారు. బోలె బాబాకు వందలాది మందితో కట్టు దిట్టమైన సైన్యం, వాలంటీర్లు సేవలందిస్తుంటారుఅని, విలువైన భవనాలు నిర్మించుకున్నాడు అని తెలిపారు. కానీ ప్రజలకు ఏ విధమైన భద్రత లేకుండా చేసి, వారి ప్రాణాలను బలిగొన్నాడు అన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇలాంటి బాబాలు ఉత్తర ప్రదేశ్ లో కో కొల్లలుగా ఉన్నారని తెలిపారు. వారి కార్యకలాపాలు నిర్వహణకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం దారుణమన్నారు.
జూలై రెండవ తేదీన బోలే బాబా ప్రవచనాలు వినడానికి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి సుమారు రెండు లక్షల మంది హాజరు కావడం జరిగిందన్నారు. ప్రవచనాలు ముగింపు తర్వాత బోలెబాబా పాద దూళి కోసం జనం ఎగబడ్డా దమ్ జరిగిందన్నారు.ఈ తోపులాటలో ఇప్పటికే 125 మంది మరణించడం జరిగిందని, మరో 200 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని తెలిపారు. లక్షల మంది హాజరైన ఇటువంటి సత్సంగ్ వద్ద బాబా వాలంటీర్లు తప్ప ఎటువంటి బందోబస్తు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అని తెలిపారు. తర్వాత కూడా గంటలు తరబడి ఎటువంటి తక్షణ వైద్య సహాయం కూడా అందలేదని మండిపడ్డారు. 125 మంది హత్యకు బాధ్యుడైన బోలే బాబా పరారీలో ఉన్నాడని,ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ఎఫ్ఐఆర్లో లో కూడా బోలే బాబాను ఎందుకు నిందితుడిగా పేర్కొనలేదని వారు ప్రశ్నించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కనుసనల్లో బాబాలు యూపీలో రాజ్యమేలుతున్నార అని తెలిపారు. వీరి మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం యూ.పీ లో అధికారంలో ఉంది అని, కోవిడ్ కాలంలో బాబా ఆశ్రమంలో నియమాలు పాటించక పోయినా ప్రభుత్వం పట్టించు కోలేకపోవడం దారుణము కాదా అని ప్రశ్నించారు.
ప్రజలు, మేధావులు మౌనం వీడి, ప్రశ్నించడం, విమర్శించడం అందరూ అలవాటు చేసుకోవాలని తెలిపారు. మూడవిశ్వాసాలతో ప్రజలు ఉన్నంతకాలం ఇటువంటి బాబాలు పుడుతూనే ఉంటారు అని తెలిపారు. బాణామతి, చిల్లంగి, చేతబడి వంటి వాటి పేరిట సాటి మనుషులను కొట్టి చంపడం, గుప్త నిధుల కోసం పసివారిని బలివ్వడం టీవీలలో, పత్రికలలో చూస్తున్నామని తెలిపారు. గుడ్డి నమ్మకాలతో తాయెత్తులు రంగు రాళ్లు ధరిస్తూ , అనారోగ్యానికి చికిత్స చేసుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మంచి పద్ధతి కాదని తెలిపారు. గతంలో గుర్మిత్ రామ్ సింగ్, ఆశారాం బాపు, రాంపాల్, డేరా బాబా లాంటి నకిలీ బాబాలు ప్రజలను నిరంతరం మోసం చేస్తూనే ఉన్నారని,. మోసపోయిన వారిలో మెజారిటీ గా మహిళలు కావడం విశేషం అన్నారు. మూఢవిశ్వాసాలను, అశాస్త్రీయ భావాలను వదిలించుకోవాలని, సత్యాన్ని తెలుసుకోవాలని స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పిన విషయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి తెలిపారు. ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, జన విజ్ఞాన వేదిక కోరుతోంది అని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ.హెచ్ ప్రకారం ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండి ,ప్రచారం చేయాలి అని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img