London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 7, 2024
Monday, October 7, 2024

అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శరణ్య రాత్రుల మహోత్సవ వేడుకలు ఈవో వెంకటేశులు, భక్తాదులు, అర్చకులు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారు నాల్గవ రోజున అన్నపూర్ణేశ్వరీ దేవి అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు.

పట్టణములోని శ్రీనివాస నగర్ (గుడ్డి బావి వీధిలో) గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయములో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. నాల్గవ రోజున స్వామి వారు సూర్య ప్రభ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

పట్టణములోని సాలే వీధిలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో నాల్గవ రోజు రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ వారు తెలిపారు. మహా పోషకులుగా బుగ్గ ప్రతాప్, లావణ్య, బుగ్గ నారాయణస్వామి, సుమ వ్యవహరించారు.

పట్టణంలోని సాలే వీధిలో గల అంబా భవాని దేవాలయంలో నాల్గవ రోజు అమ్మవారు మధుర మీనాక్షి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు.

పట్టణములోని యాదవి వీధిలో గల గాయత్రీ దేవాలయములో నాల్గవ రోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు.

పట్టణంలోని కొత్తపేటలో గల టీచర్స్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

పట్టణంలోని సాలే వీధిలో గల పుట్లమాంబ దేవి ఆలయంలో ఆలయ కమిటీ దాతల సహకారంతో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు జరిగాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాద పంపిణీ చేశారు. అమ్మవారు నాల్గవ రోజు మధుర మీనాక్షి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ గిర్రాజు ప్రసాద్, గిర్రాజు నగేష్, కోటమ్ రవి తదితరులు పాల్గొన్నారు.

పట్టణములోని శివానగర్, కేశవ నగర్ లలో వెలసిన శ్రీ విజయ చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ, భక్తాదులు, దాతల సహాయ సహకారములతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు.

పట్టణంలోని వాసవి గుడి, తొగట వీధిలోని శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం, లక్ష్మీ నగర్ లోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇందులో భాగంగా పట్టణంలోని కెపిటివీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాల్గవ రోజున అమ్మవారు సాయంత్రం గాయత్రీ దేవి దేవి అలంకరణ లో భక్తాదులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరి రమణయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ గుప్తా కార్యదర్శి తబ్జుల శ్రీనివాసులు కోశాధికారి పిన్ను అశోక్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ పిన్ను శ్రీనివాస ప్రసాద్ తో పాటు అనుబంధ సంఘం ఆర్యవైశ్యులు, భక్తాదులో పాల్గొన్నారు.

పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాథం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ ,కోశాధికారి వెంకటేశులు, (చిట్టి) తదితర సభ్యుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల 41 వ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నాల్గవ రోజున అమ్మవారు మధుర మీనాక్షి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.

పట్టణంలోని లక్ష్మీ నగర్ రాజేంద్రనగర్ లో గల శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాల్గవ రోజున అమ్మవారు రాజా రాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తాదులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు.

పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, రాంనగర్ శ్రీ చౌడేశ్వరి దేవి కట్ట వద్ద గల శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం, గాంధీ నగర్ లోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయములలో దసరా 4 వ రోజు దసరా శరన్నవ రాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు భక్తాదులు, ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు గౌరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు సుదర్శన చార్యులు, అనిల్ కుమార్ ఆచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ, ట్రస్ట్ సభ్యులు మెటికల కుల్లాయప్ప, శంకర సంజీవులు, దత్త సాంబశివ, రంగా శ్రీనివాసులు, గుత్తి రామాంజనేయులు, నాగప్ప, సాగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా రామ్ నగర్ లోని శ్రీ చౌడేశ్వరీ దేవి కట్టవద్ద గల శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయంలో ఆలయ కమిటీ దాతల సహకారంతో ఘనంగా దసరా శరన్నవరాత్రుల వేడుకలు జరుపుకున్నారు. నాలుగవ రోజు అమ్మవారు మీనాక్షి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామకృష్ణ, పూజారి గంగా ప్రసాద్, బాలు పెద్ద వెంకటేష్ రంగయ్య వరదరాజులు, మారుతి కుమార్, చింత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్ లోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో 33 వ శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమ్మవారు నాలుగవ రోజు మధుర మీనాక్షి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగం ఆదినారాయణ, కార్యదర్శి నీలూరి నారాయణస్వామి, కోశాధికారి లక్ష్మీ నరసింహులు, తదితర కమిటీ సభ్యులు భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img