Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

ధర్మవరంలో జరిగిన ప్రతి కబ్జాకి లెక్క చెప్పాల్సి ఉంటుంది..

వైసీపీ నేతలకు ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక
విశాలాంధ్ర- ధర్మవరం:: ధర్మవరంలో జరిగిన ప్రతి కబ్జా కి లెక్క చెప్పాల్సి ఉంటుందని, మేము అభివృద్ధి చేస్తామన్న భయంతోనే వైసీపీ వాళ్లు విషయం చెబుతున్నారని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని వాటర్ ట్యాంకులను, అన్నా క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తో పాటు వారు పరిశీలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు స్వైర విహారం చేసిన చేసిందని ఇక మీ ఆటలు సాగనివ్వమని వారు హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్థితిగతులను వారే స్వయంగా పరిశీలించారు. కమీషనర్ తో పాటు పలు ప్రాంతాలలో పర్యటించి 28వ వార్డులోని వాటర్ ట్యాంకు, సిద్దయ్య గుట్టలోని సాయిబాబా వాటర్ ట్యాంకు, ఎల్పీ సర్కిల్లోని అన్నా క్యాంటీన్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ కూడా వారు పరిశీలించారు. అమృత్ స్కీం కింద మంజూరైన పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం పై వారు ఆరా తీశారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులను వారు కోరారు. ఐదేళ్లుగా మూతపడ్డ అన్నా క్యాంటీన్లను పరిస్థితిని తాము స్వయంగా పరిశీలించడం జరిగిందని, అతి త్వరలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం జరుగుతుందని తెలిపారు. టిడిపి పై కక్షతో ప్రజలకు పెట్టే భోజనాన్ని వైసీపీ ప్రభుత్వం దూరం చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే వార్డుల వారీగా సమస్యలు ఏమున్నాయి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న దానిపై సమీక్ష చేసుకొని, మంత్రి సత్య కుమార్ సహకారంతో వాటన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ధర్మవరంలో ప్రశాంతత కోసం తాను కృషి చేస్తున్నానని ఇప్పుడు కూడా తాము ప్రశాంతతను కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం గౌడ్, పరిసే సుధాకర్, ఫణి కుమార్, టిడిపి సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img