Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

ఇల్లు లేని ఎలక్ట్రీషియన్ ప్లంబర్లకు ఇంటి పట్టా ఇవ్వండి..

రాష్ట్ర బిజెపి నాయకులు అంబటి సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రాజకీయ పలుకుబడితో ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ కు కేటాయించిన పట్టాలను రద్దుచేసి నిజమైన ఇల్లులేని ఎలక్ట్రీషియన్ ప్లంబర్లను గుర్తించి ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ యాదవ్ ద్వారా ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు అంబటి సతీష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఇంచార్జ్ హిందూపూర్ పార్లమెంటు నాయకులు బాలకృష్ణ యాదవ్ ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని సర్వేనెంబర్ 650-2 లో 75 మందికి ఫ్లాట్ ఇవ్వడం జరిగిందని అది పేరుకు మాత్రమే ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ అనే పేరు పెట్టి రాజకీయ ఒత్తిడితో ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా కొంతమంది రాజకీయ నాయకుల మద్దతుదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ పట్టాలలో చాలా కొద్ది మంది ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్లు ఉన్నారని ఈ పట్టాలని రద్దుచేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించి న్యాయం చేయాలని వారు తెలిపారు.స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ త్వరగా విచారణ చేపట్టి న్యాయం చేస్తానని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img