విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని గోట్లూరు గ్రామంలో గల అనాధ వృద్ధాశ్రమంలో పట్టణంలోని శ్రీదేవి టాకీస్ వద్ద గల చిన్నారి సీఎం ఆధ్యా పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శారద మోహన్ తో పాటు నాగభూషణం కుటుంబ సభ్యులు ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నవారికి అన్నదానం చేస్తూ, వృద్ధుల యొక్క ఆశీస్సులను కూడా అందుకోవడం జరిగింది. దాతలు మాట్లాడుతూ ఇటువంటి పుణ్యకార్యం చేయడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రఫుల్ల చంద్ర దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిజైనర్ జూజారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.