Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శరీర అవయావాలలో ముఖ్యమైనది కాలేయము

స్పందన హాస్పిటల్ డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా

విశాలాంధ్ర ధర్మవరం:: కాలేయము(లివర్) విటమిన్ లను నిల్వ చేస్తుందని స్పందన హాస్పిటల్ డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు తెలిపారు. ఈ సందర్భంగా వరల్డ్ లివర్ డే సందర్భంగా పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శరీర అవయాలలో ముఖ్యమైనది కాలేయము అని, ఆహారములో కార్బో హైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్ జీర్ణ ప్రక్రియలో ప్రధాన పాత్ర ప పోషిస్తుందని తెలిపారు. అదేవిధంగా మనం తీసుకున్న మందులు, కొలెస్ట్రాల్ మొదలైన వాటిని శరీరం నుండి బైల్ ద్వారా తొలగిస్తుందని తెలిపారు. రక్తంలోని అధిక గ్లూకోజ్ ను కాలేయం తీసుకొని, గ్లైకోజిన్ రూపంలో నిలువ చేస్తుందని తెలిపారు. శరీరానికి అవసరమైన రక్తం గడ్డకట్టే పదార్థాలను కూడా తయారు చేస్తుందని తెలిపారు. ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ను తయారు చేయడం ద్వారా రక్తంలోని బ్యాక్టీరియని కూడా తొలగిస్తుందని తెలిపారు. మరి కాలేయం దెబ్బతినే అవకాశాలలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వైరల్ ఇన్ఫెక్షన్ వలన కూడా కాలేయం దెబ్బతింటుందని తెలిపారు. కుక్కలను పెంచుకొనుట, గొర్రెలతోను సన్నిహితంగా ఉండటం ద్వారా కూడా హైడి టిట్ అనే వ్యాధి ద్వారా సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఆల్కహాల్ వలన సిరోసిస్ అనే జబ్బు రావడం, కడుపు ఉబ్బడం, రక్తనాళాలు కడుపులో పగలడం వల్ల చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. శరీరంలో జాండీస్ రావడం వలన కూడా లివర్ పనితీరులో మార్పు వస్తుందని తెలిపారు. హెపటైటిస్ బి. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా లివర్ను వైరల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుకునే అవకాశం కలదని తెలిపారు. ఆల్కహాల్ (మద్యం) సేవించకపోవడం ద్వారా ఏవైనా మందులు వాడుతూ ఉంటే, జాండీస్ వచ్చినట్లయితే ఆ మందులను వెనువెంటనే వినియోగించడం మానాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img