విశాలాంధ్ర -చిలమత్తూరు రూరల్ (శ్రీ సత్యసాయి జిల్లా) : మండల పరిధిలోని కోడూరు పంచాయతీలో సోమవారం సర్పంచ్ మురళి ఆధ్వర్యంలో కార్యదర్శి భాస్కర్ కాంపోస్టు తయారీకి వాన పాములు కొనుగోలు చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచడంతో పాటు, వచ్చిన వ్యర్థాలను డంపు చేసి, వాటి ద్వారా కాంపోస్ట్ తయారు చేసి గ్రామపంచాయతీకి ఆదాయం సమకూర్చాలనే దృఢ సంకల్పంతో వానపాములు కొనుగోలు చేశామన్నారు, షెడ్ల లోని తొట్టెలలో వర్మీ కంపోస్ట్ తయారీ చేసి చౌక ధరకే రైతులకు కాంపోస్టును అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.