London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

విశాలాంధ్ర ధర్మవరం: దేశవ్యాప్తంగా కార్మికుల కోర్కెల దినోత్సవ సందర్భంగా స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుండి కళాజ్యోతి సర్కిల్ . కాలేజీ సర్కిల్. మీదుగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీను సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు అయుబుఖాన్, ఆదినారాయణ, ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం, ధర్మవరం డిప్యూటీతహసిల్దార్ ఈశ్వరయ్య సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూదేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించిడం జరిగిందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాట్యూటీని అమలు చేయాలి అని, పిఎఫ్. ఈఎస్ఐ. సౌకర్యం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ధర్మవరం పట్టణంలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు,
-ఈ ఎస్ ఐ. అమల కోసం ప్రత్యేక హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని, పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, మినీ అంగన్వాడీలను. మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం స్కీం పథకాలకు బడ్జెట్ను పెంచాలని, అంగన్వాడి, మున్సిపాలిటీ. ఆశా,మధ్యాహ్నభోజన తదితర కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. అంగన్వాడి వర్కర్స్కు ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేసి,
ప్రస్తుత అండ్ పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పెద్దన్న, ఎస్ హెచ్ భాష, జెవి రమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి చంద్రకళ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ముకుందా, చెన్నకేశవులు,
డివైఎఫ్ఐ నాయకులు బాలాజీ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకురాలు దీన, పోతక్క, అరుణ, చింతమ్మ, ఫాతిమా, గోవిందమ్మ, మాంచాలి దేవి, ప్రభావతి, మున్సిపల్ నాయకులు కేశవ, వెంకటేష్, చంద్ర, సాలమ్మ, చెన్నమ్మ . పెద్దక్కతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img