London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ధర్మవరం ఆర్టీసీ డిపో సమస్యలను పరిష్కరించండి..

ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపోలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా ఆర్టిసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నాగార్జున రెడ్డి, రీజినల్ జాయింట్ సెక్రెటరీ నరసింహులు, డిపో కార్యదర్శి ముస్తఫా, ఎడిసి మేడాపురం నరసింహులు, మునయ్య తదితరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం నుండి ఆర్టీసీ డిపో డిపో ద్వారా చెన్నై బస్సు ప్రారంభ శోభ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత ధర్మవరం నుండి చెన్నైకి బస్సు ప్రారంభించిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అదేవిధంగా సర్వీసులు పునరుద్ధరణ చేయాలని, పల్లె వెలుగు సర్వీసులను పునరుద్దించాలని, గతంలో ఉన్న విజయవాడ సూపర్ లగ్జరీ సర్వీసు, మంత్రాలయం ఎక్స్ప్రెస్ సర్వీస్ ని కూడా పునరుదించాలని తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులకు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారని డిపో ఆవరణములో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని కోరారు. బస్టాండ్ లోని ముఖద్వారం శిథిలావస్థలో ఉన్నదని, ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఆందోళనలో ఉద్యోగస్తులు ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా డిపో మేనేజర్లు వస్తున్నారు… పోతున్నారు… కానీ ప్రయాణికులకు ఆర్టీసీ ఉద్యోగులకు కనీస సౌకర్యమైన తాగునీటి వ్యవస్థను సంవత్సరం పొడుగునా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులు ప్రయాణించేటప్పుడు ఆటోలో పెడితే ఎక్కువగా ఉన్నదని, పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తమ సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించి తీరుతానని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img