శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ ఎన్. జి. కే. ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: మానవ శరీరంలోని ప్రతి అవయం పట్ల ప్రజలందరూ ప్రత్యేక శ్రద్ధ కనపరచడం ఎంతో అవసరమని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎన్జీకే ప్రసాద్, వైద్యులు అనిల్, ప్రమోద తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మాధవ నగర్ లో గల సత్యసాయి భజన మందిరంలో ఏసియన్ వాస్క్యులర్ హాస్పిటల్- హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తనాళాల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరంలో ఉబ్బి మెలికలు తిరిగిన నరాలు, సాలెపురుగు (స్పైడర్) లాంటి నరాలు, కాలు లేదా పాదములో వాపు, సిరపుండ్లు, కాలల్లో రక్త సరఫరా లేకపోవడం, తలకు రక్త సరఫరా లేకపోవడం, నొప్పి రావడం, రక్త నాళాలు కనిపించడం, నయం కానీ పుండు వంటి వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికీ కూడా వైద్యులచే ఉచిత వైద్య చికిత్సలను అందించడం జరిగిందని తెలిపారు. ఉచిత రక్తనాళాల సర్జన్ కన్సోలేషన్, రూ.4,500 విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా, నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం పై తెలిపిన సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సలతో పాటు మందుల వాడకం యొక్క పద్ధతులను, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఆధునిక వైద్యంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన వైద్యులు, 12 వేలకు పైగా సస్య చికిత్సలను విజయవంతంగా చేయడం జరిగిందని తెలిపారు. రక్తనాళాల వైద్యమే మా ప్రత్యేకత అని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 200 మంది రోగులు పాల్గొనగా లేజర్ సర్జరీ కింద 65 మందిని ఎంపిక చేసి ఈనెల ఏడవ తేదీన హైదరాబాద్కు ఉచిత రవాణా ఖర్చుతో తీసుకుని వెళ్లి, తిరిగి ధర్మవరంకు వదలడం జరుగుతుందని తెలిపారు. బస్సు కూడా ఉచితమైననీ అని తెలిపారు. ఈ శిబిరానికి ఇంతటి స్పందన రావడం పట్ల కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా ఆసుపత్రి ద్వారా ఈ. హెచ్. ఎస్., ఆరోగ్యశ్రీ, ప్రధానమంత్రి సడక్ యోజన లాంటి ప్రభుత్వ పథకాలకు ఉచితంగా వైద్య చికిత్సలు, ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవ సమితి సేవాకర్తలు చంద్రశేఖర్ రామాంజనేయులు రామకృష్ణ సురేషు మల్లికార్జున, పరంధామ, శ్రీనివాసులు, పద్మావతి, వెంకటేష్, వాస్కులర్ హైదరాబాద్ ఆసుపత్రి జోనల్ ఇంచార్జ్ సురేంద్ర, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.