Friday, October 25, 2024
Friday, October 25, 2024

వేరుశెనగ విత్తన పంపిణీ కోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు మొదలు

మండల వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర ధర్మవరం:: ఖరీఫ్ సీజన్ 2024 సంబంధించి వేరుశెనగ విత్తన పంపిణీ కోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమమును రైతు భరోసా కేంద్రాలలో ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వేరుశనగ విత్తనాలు కావలసిన రైతులు తమ రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకోవలసినదిగా తెలిపారు. వేరుశెనగ క్వింటాల్ పూర్తి ధర రూ .9,500 సబ్సిడీ రూ.3,800 ఫోను రూ.5,700 చెల్లించాలని తెలిపారు. సబ్సిడీ పోను ఒక బ్యాగు రూ.1,710 చెల్లించాలని తెలిపారు. అర్ధ ఎకరాలోపు విస్తీర్ణం కల రైతులకు ఒక బ్యాగు, అర్థ ఎకరా నుండి ఒక ఎకరా లోపు గల రైతులకు రెండు బ్యాగులు, ఒక ఎకరా పైన విస్తీర్ణం గల రైతులకు మూడు బ్యాగులు వేరుశెనగ విత్తనాలను సరఫరా చేయబడుతుందని తెలిపారు. కావున ధర్మవరం డివిజన్ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img