London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

ప్రతి పేదకు ఇంటి పట్టా ఇచ్చే వరకు పోరాటం

కోట్లాది రూపాయల భూమిని కాదేసేందుకు మాజీ ఎమ్మెల్యే

  • * మఠం భూమి పేదలకే దక్కాలి
  • * సిపిఐ ఆధ్వర్యంలో మఠం భూముల్లో ఎర్రజెండాలు నాటిన సీపీఐ నాయకులు
  • విశాలాంధ్ర -బత్తలపల్లి: ప్రతి పేదకు ఇంటి పట్టా ఇచ్చేవరకు భూ పోరాటం చేస్తూనే ఉంటామని శ్రీ సత్యసాయి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. బత్తలపల్లిలోని ధర్మవరం రోడ్డుకు ఉన్న 401 సర్వే నంబర్ 19.84ఎకరాలలో సిపిఐ ఆధ్వర్యంలో జెండాలు నాటారు. ఈ కార్యక్రమానికి వేమయ్యయాదవ్ తో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్ర, రైతు సంఘం నాయకుడు కాటమయ్య, చేనేత సంఘం నాయకుడు జింకా చలపతి, డివిజన్ సిపిఐ కార్యదర్శి మధు పాల్గొని లబ్ధిదారులతో బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలి నుంచి ప్రదర్శనగా వెళ్లి జెండాలు నాటి, గుడిసెలు వేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ కర్ణాటకలోని నిడిమామిడి మఠానికి చెందిన 19.84ఎకరాలు భూమిని మఠానికి భూమిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి తన అనుచరుల పేరిట నకిలీ దస్త్రాలను పుట్టించి కాజేసేయత్నం చేశారన్నారు. మరో వర్గం ఏమో తమది అని వారు కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని వీటిపై ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వం అక్రమాలకు కేరాఫ్ గా మారిపోయిందన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేస్తుండడంతో ఒక తహసిల్దార్ నాడు అధికార దాహానికి పాల్పడగా వాటిపై ఉద్యమించామన్నారు. అప్పుడు ఉన్నతాధికారులు కూడా విచారణ జరిపి అధికారినిపై చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం వందల ఎకరాల భూములను వైకాపా కార్యకర్తలకు అక్రమంగా కట్టబెట్టారన్నారు. నివాసం లేని పేదలకు వీటిని పంపిణీ చేయాలన్నారు లేని పక్షంలో కోర్టులకు వెళ్లినా కూడా పేదలకు అందించే వరకు మా భూ పోరాటం జరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img