Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం

మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
విశాలాంధ్ర -తనకల్లు : సమాజంలో మాదిగల అభివృద్ధి కోసం ఎమ్మార్పీఎస్ ను స్థాపించి అనేక పోరాటాల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపుతూ అందరినీ చైతన్య పరుస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపి నేడు ఎస్సీ వర్గీకరణను సాధించినందుకు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో మండల దళిత నాయకులు ప్రజలు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు శంకరా చంద్ర రవి ఎస్సీ సెల్ నాయకులు చిన్నప్ప కుల్లాయప్ప హనుమంతు ఈ. శ్రీనివాసులు కుమార్ కదిరప్ప తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img