అంతఃకరణ శుద్ధితో డీఎస్సీలో విజయ శిఖరాలు
అనంతలో 807 పోస్టులు భర్తీకి ప్రణాళిక..
జిల్లా విద్యాశాఖ అధికారి: ఎం. ప్రసాద్ బాబు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: దేశానికి విద్య, వైద్యం రెండు కళ్ళు వంటివని.. ఉపాధ్యాయ వృత్తి జ్ఞాన జ్యోతి వంటిదని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం .ప్రసాద్ బాబు పేర్కొన్నారు. శనివారం డీఎస్సీ నోటిఫికేషన్ భర్తీపై అభ్యర్థుల ప్రణాళిక రచనపై విశాలాంధ్ర ఇంటర్వ్యూ నిర్వహించగా .ఈ సందర్భంగా డి ఇ ఓ మాట్లాడుతూ..గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర..అంటే గురువు స్థానం త్రిమూర్తులతో సమానం.ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు.. డీఎస్సీ నోటిఫికేషన్ తీపి కబురు ను ప్రభుత్వం అందించింది. అంతకరణ శుద్ధితో సమయపాలన నిర్దేశించుకుని.. పోటీ తత్వాన్ని ఎదుర్కొని ప్రతి అభ్యర్థి విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు అన్నారు . అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ లో 661 పోస్టులు, మున్సిపాలిటీ పరిధిలో 146 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాడమిక్ పుస్తకాలు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అధ్యయనం, కరెంట్ అఫైర్స్, జాతీయ, అంతర్జాతీయ, వర్తమానం అంశాలుపై పట్టు సాధించాలన్నారు. ఉపాధ్యాయుడు బోధించే విద్యాబోధనతో.. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఇంజనీరు, శాస్త్రవేత్తలు, ఆర్థిక , పోలీస్ , వైద్యులుగా తీర్చిదిద్దే అద్భుతం అవకాశం ఉపాధ్యాయ వృత్తి అన్నారు..జీవితంలో తల్లిదండ్రులు తర్వాత.. గురువులే ప్రముఖ పాత్రను పోషిస్తారు. మంచి, చెడు చెప్పి… జీవిత పాఠాలను బోధిస్తారు. స్నేహితుడి గా బుజ్జగించి పాఠాలు నేర్పిస్తారు. సమాజంలో మన పాత్ర ఏమిటో తెలియజేసి ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దుతారు. విద్యార్థులు జీవిత గమ్యాన్ని సాధించినప్పుడు.. ఉపాధ్యాయులకు నిజమైన ఆనందం, సంతృప్తిని ఇస్తుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ సన్నద్ధత సమయంలో సమయం విలువైనది.. విజయాన్ని చేరువు చేసే.. అద్భుత అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని.. అలాగే మానసిక ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు పాటించాలని అభ్యర్థులు సూచించారు.