Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటి వద్ద ఎగురవేయాలి..

మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం;; దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భారత దేశంలో నీ ప్రజలందరూ కూడా ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కావున మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంట ప్రతి ఒక్కరు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి బాలకృష్ణ యాదవ్, ధర్మవరం అసెంబ్లీ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి, అంబటి సతీష్, చంద్రశేఖర్, షాకే ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img