London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్స్ ని కొనసాగించాలి..

ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ
విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సును కొనసాగించాలని శ్రీ సత్య సాయి జిల్లా ఏపీ ఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి బండి శివా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ చేరుటకు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అన్నారు. ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సును ఎత్తివేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు కోసం బీకాం జనరల్ కోర్సును చాలామంది విద్యార్థులు చదవడానికి శ్రద్ధ చూపుతున్నారు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్స్ తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సును కొనసాగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలా చేయడంవల్ల ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో విద్యార్థులు లేక మూతపడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కనబడుతోందని తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగుతున్న సందర్భంగా ఇప్పటికి ఆన్లైన్లో రిజర్వేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్స్ ఆప్షన్ కనిపించడం లేదని, కానీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మాత్రం బీకం జనరల్ కోర్స్ కనపడుతోందని తెలిపారు. కావున దీనిపైన తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా బీకాం జనరల్ కోర్సును కొనసాగించాలని వారి విజ్ఞప్తి చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న సందర్భంగా ఇప్పటిలోపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా బీకాం జనరల్ కోసం కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏపీఎస్ ఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అండగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏ పి ఎస్ ఫ్ ధర్మవరం పట్టణ నాయకులు నవీన్, స్వామి, ఉదయ్, పవన్, మల్లి తదితరులు పాలొగొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img