Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు..

స్పష్టం చేసిన పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్ డి ఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు అని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముగ్గురు విలేకరులతో మాట్లాడుతూ గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వల్ల చాలా ఇబ్బందులు పడటం వాస్తవమేనని, కానీ నియోజకవర్గం దృష్ట్యా తాము కలిసే పని చేస్తామని తెలిపారు. నియోజకవర్గ సమస్యలతో పాటు కమిషనర్ మల్లికార్జున విషయాని కూడా మంత్రి సత్య కుమార్ కు తెలపడం జరిగిందని తెలిపారు. త్వరలో విచారణ చేపట్టి తప్పు ఉంటే మరో కమిషనర్ని బదిలీగా రావడం జరుగుతుందని వారు తెలిపారు. మా మూడు పార్టీల లక్ష్యం ధర్మవరం అభివృద్ధి అని తెలిపారు. కేవలం కమిషనర్ మల్లికార్జున నియామకం అంశముపై మాత్రమే తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ముందు మేము ఎలా కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా అలానే కలిసి ఉంటామని వారు స్పష్టం చేశారు. కచ్చితంగా మంత్రి సత్య కుమార్ ప్లస్ అవుతారని తెలిపారు. చిన్నచిన్న ఘటనలు రాజకీయాల్లో మామూలే నాని తెలిపారు. తాము నియోజకవర్గంలో జీవనోపాధి, ప్రాజెక్టుల పైన మంత్రిని అడగడం జరిగిందని, అదేవిధంగా రైతులు, పెంపకపు దారులు ,వ్యవసాయము, పాడిపంట, సబ్సిడీలు వాటిపై తప్పక దృష్టి పెట్టాలని న్యాయం చేయాలని మంత్రిని అడగడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో చర్చించి తప్పక న్యాయం చేస్తానని తెలపడం జరిగిందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో నియోజకవర్గపై దృష్టి తప్పక పెట్టడం జరుగుతుందని తెలిపారు. మంత్రి సత్య కుమార్ ద్వారా అభివృద్ధి తప్పక జరుగుతుందన్న నమ్మకం మాకు ఉందని వారు తెలిపారు. త్వరలో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందని తెలిపారు. మొన్న మంత్రిని అడ్డుకున్న సంఘటన అనుకోకుండా జరిగిందని తెలిపారు. అభివృద్ధి కోణంలోనే మంచి యువకుడు అధికారిగా రావాలని మంత్రి కోరుకున్నాడే తప్ప కమిషనర్ అంశాన్ని పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img