London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. దాత పామిశెట్టి నవ శంకర్

విశాలాంధ్ర- ధర్మవరం;; పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని దాత పామిశెట్టి నవ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మందికి ఉదయం అల్పాహారం (టిఫిన్) కుటుంబ సభ్యుల చేత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను తన సంపాదనలో పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని. తాను చీరల వ్యాపారం చేసుకుంటూ అందులో వచ్చిన ఆదాయంలో కొంత భాగం ఈ అన్నదాన కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నట్లు వారు తెలిపారు. గత ఒకటిన్నర సంవత్సరముగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి పట్టణంలోని వారే కాకుండా ఇతరత్రా గ్రామాల నుండి వైద్య చికిత్స కోసం వస్తున్నారని, అలాంటి వారి కోసం తన వంతుగా ప్రతి ఆదివారం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం నా కర్తవ్యం గాను, దైవ సేవ గా తాను భావిస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ నవ శంకర్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం రోగులకు, వారి సహాయకులకు వరం లాగా మారిందని, ఆకలిని తీర్చే మహోన్నత కార్యంగా వారు భావిస్తూ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img