విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరంలోని మార్కెట్ యార్డులో రైతుల ఆరబెట్టిన వేరుశెనక్కాయలు బుధవారం వర్షానికి తడిసి పోయినవి. మార్కెట్ యార్డ్ లో ఉన్న షేడ్ పైకప్పు నుంచి వర్షం నీరు రావడంతో వేరుశెనక్కాయలు తడిసిపోయినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు తీవ్ర నష్టం కలిగిందని వాపోయారు. మాకు జరిగిన ఈ నష్టానికి ప్రభుత్వమే ఆదుకోవాలని వారు విన్నవించుకున్నారు.