London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 16, 2024
Wednesday, October 16, 2024

ఎస్సీ నియోజకవర్గ కేంద్రానికి దారెటు?


పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

విశాలాంధ్ర శింగనమల : ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ కేంద్రమైన శింగనమలకు సిక్స్ వే వల్ల దారి లేకుండా పోతోందని శింగనమల మండల కేంద్రానికి సిక్స్ వే నుండి మరవ కొమ్మకు రోడ్డును కలిపి రహదారిని ఏర్పాటు చేయాలని, శింగనమల యువత ఆధ్వర్యంలో బుధవారం మరవకొమ్మన సిక్స్ వే లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనాల రాకపోకలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు, అనంతరం యూత్ నాయకులు మాట్లాడుతూ అనంతపురం వెళ్లాలంటే సిక్స్ వే లో కలిసే టప్పుడు కుడి నుండి ఎడమకు పోవాలంటే హైవేలో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఆవేదన వ్యక్తం చేశారు,శింగనమల నుండి తాడిపత్రికి వెళ్లాలన్నా శివపురం పెద్దమ్మ గుడి సమీపానికి వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉంటుందని , రాత్రి సమయాల్లో మహిళలు, వృద్ధులు వికలాంగులు, ఒక కిలోమీటర్ దూరం నుండి మరవకొమ్మకు నడిచి రావాలన్నా, పోవాలన్నా,తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాత్రి వేళల్లో భయం గుప్పెట్లో పెట్టుకుని,మరవ కొమ్మకు రావాల్సి ఉంటుందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నియోజకవర్గ కేంద్రం అయ్యి ఉండి కూడా మరవకొమ్మ న సిక్స్ వేలో ఫ్లై ఓవర్ నిర్మించకుండా, శింగనమల మండల ప్రజలకు సక్రమమైన రోడ్డు మార్గము లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నా ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఫ్లై ఓవర్ నిర్మించకపోవడం దురదృష్టకరమని , ప్రజల సమస్యలు ప్రజా ప్రతినిధులు గాలికి వదిలేస్తున్నారని, సిక్స్ వే రోడ్డు పూర్తవుతున్నా ఫ్లై ఓవర్ లేకుండా రోడ్డు ముగింపు పలకడం శింగనమల మండల ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, యూటర్న్ తీసుకొని సిక్స్ వేలో కలిసే సమయంలో ప్రమాదాలు జరిగేందుకు మెండుగా అవకాశాలున్నాయని, సక్రమమైన దారిలేని శింగనమలనియోజకవర్గ కేంద్రంగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సిక్స్ వే రోడ్డుకు శింగనమల శ్రీరంగ రాయల చెరువులో నీళ్లు ట్యాంకర్ల ద్వారా వాడుకొని శింగనమలకు ఫ్లై ఓవర్ నిర్మించకుండా అన్యాయం చేయడం దురదృష్టకరమని, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన చందంగా అధికారుల దుస్థితి తయారయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరవకొమ్మన క్రాస్ లో పార్కును ఏర్పాటు చేసి బస్సు షెల్డర్ను నిర్మించాలని, కోరారు, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి శింగనమలమరవ కొమ్మన ఫ్లైఓవర్ ను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో శింగనమల చెరువులో నుండి చుక్క నీళ్ళు రోడ్డుకు వెళ్ళ కుండా అడ్డుకుంటామని,హెచ్చరించారు, సిఐ కౌలుట్లయ్య ఎస్సై శరత్చంద్ర ధర్నా చేస్తున్న యువకులకునచ్చజెప్పి ధర్నాని విరమింప జేశారు, అనంతరం తహసిల్దార్ బ్రహ్మయ్యతో సమస్యను విన్నవించారు,ఈ కార్యక్రమంలో శింగనమలమండల యువత, మత్స్యకారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img