Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో ధర్మవరం బాల బాలికలు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం:; రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక కావడం జరిగిందని ధర్మాబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఈ నెల అక్టోబర్ 26 తేదీ నుండి 28 వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా మార్టూరు పట్టణంలో జరిగే 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్( హెచ్డిఎఫ్ )రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో లో పాల్గొనే అండర్ 17 విభాగంలో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన జి.కిరణ్మయి, బి.నీఖ్యశ్రీ , ఎం.యశస్విని, ముగ్గురు బాలికలు, అలాగే బాలుర విభాగంలో ఆర్.లక్ష్మీ నరసింహ, ఎం. కార్తీక్ నాయక్ ఏకంగా ధర్మవరం పట్టణానికి చెందిన ఐదు మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు.
అక్టోబర్ 21వ తేదీన తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి, ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిడి .నాగేంద్ర హర్షం వ్యక్తం చేశారు . రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రానించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు… ఎంపికైన క్రీడాకారులు శుక్రవారం రోజున బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా మార్టూరు కు చేరుకుంటారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img