London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

అధికారుల బదిలీలతో సమస్య పరిష్కారం కాదు…..

చేనేత జౌళి శాఖ మంత్రి సవిత చేనేత పరిశ్రమపై స్పందించాలి…..

సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి ముసుగు మధు.
చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ


విశాలాంధ్ర ధర్మవరం ; చేనేత పరిశ్రమపై చేనేత జోలి శాఖ మంత్రి సవిత స్పందించాలని, అధికారులు బదిలీలతో సమస్య పరిష్కారం కాదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా
పట్టణంలో ఎన్జీవోస్ నందు చేనేత కార్మిక సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ ధర్మవరంలో చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించి, విచ్చలవిడిగా పవర్ లూమ్స్ లో పట్టు చీరలు తయారు చేస్తున్నారు అని మండిపడ్డారు. కానీ రిజర్వేషన్ చట్టాన్ని కాపాడాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి, చేనేత కార్మికుల కష్టానికి శాపంగా మారుతుండడం దారుణమన్నారు. ఇప్పటికే పట్టణంలో చేనేత కార్మికులు గిట్టుబాటు ధరలు లేక పెరిగిన ధరలతో కుటుంబాన్ని పోషించలేక పురుగుల మందు త్రాగి, ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో బాధను కలిగిస్తోందని తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం ఎలా బ్రతకాలో అధికారులు, ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఆత్మహత్యలన్నీ కూడా జౌళి శాఖ ఎన్పోస్ట్ మెంట్ నిఘ వైఫల్యమే అని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే పట్టణంలో ఒకే బిల్డింగ్ లో 100 నుంచి 200 వరకు లూమ్స్ మగ్గాలను నడుపుతున్నారంటే, సంబంధిత అధికార యంత్రాంగం ఎంతవరకు వైలేషన్ జరగకుండా అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.ఇప్పటివరకు పట్టణంలో చేనేత బకాసులను వదిలి, ఒకటి రెండు మగ్గాలు నేస్తున్న యజమానులపై కేసులు పెట్టి, తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారే తప్ప, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు కానివ్వకుండా అడ్డుకుంటున్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై అధికారులు శీతకన్ను చూపిస్తున్నారనేది దీనికి నిదర్శనం అని అన్నారు. పవర్ లూమ్స్ మగ్గాల నుండి చేనేత పరిశ్రమను కాపాడాలని అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, ఇప్పటికే జె ఆర్ సిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి వందల పవర్ లూమ్స్ మగ్గా లు ఏర్పాటు,పవర్ లూమ్స్ లో ఫీవర్ టు ప్యూర్ యదేచ్ఛగా నడుపుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుపోవడం అధికారులు చేతివాటం కనపడుతుంది అని దుయ్యబట్టారు. అదేవిధంగా 2019 లేబర్ యాక్ట్ అమలు చేయలేదు అని, ఇప్పటికైనా చేనేత జౌలిశాఖ మంత్రి వర్యులు సవిత తగు చర్యలు చేపట్టాలని తెలియజేశారు అలాగే నేతన్న నేస్తం 24 వేల నుంచి 36 వేల రూపాయలు వెంటనే అమలు చేసి, చేనేత కార్మికులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జిల్లా అధ్యక్షులు పూల లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, ఏఐటిసి జిల్లా నాయకులు రమణ,జిల్లా ఉపాధ్యక్షులు చట్టా రవి,, పట్టణ కార్యదర్శి రవికుమార్, రమణ, వెంకటస్వామి, ఆదినారాయణ, హరి, దేవ, పాలగిరి శ్రీధర్, శ్రీనివాసులు, సురేష్, బాల రంగయ్య, అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img