Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఏప్రిల్ 27 ప్రచార భేరి బహిరంగ సభ ను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు లు విజ్ఞప్తి.
విశాలాంధ్ర -విజయనగరం :

    బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ, మతోన్మాద విధానాలపై సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 27 వ తేదీన విజయనగరం పట్టణంలో రంజని సినిమా హాలు ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి గుడి పక్కన బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని పట్టణంలో ఉన్న ప్రజలందరూ హాజరై జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు లు మీడియా సమావేశంలో ప్రజలకి విజ్ఞప్తి చేశారు.
   శనివారం ఉదయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముందుగా ప్రచార భేరి గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. అనంతరం బుగత అశోక్, రెడ్డి శంకర్రావు లు మీడియాలో మాట్లాడుతూ బిజెపి ఎన్నికల వాగ్ధానాలతో అదికారంలోకి వచ్చి  కే డీ బ్యాచ్లకు కొమ్ముకాస్తు దేశాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. నీరవ్ మోడీ లలిత్ మోడీ  కే డి బ్యాచ్ లకు రాచమర్యదలు చేస్తుందని తెలిపారు. మన దేశంలో కార్పొరేట్లకు ప్రధాని.మోదీ ఒక పి.ఏ గా పని చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోడీ వ్యసాయ రంగానికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా రంగాన్ని కషాయానికి అప్పచెప్పారన్నారు. లౌకిక వ్యవస్థ పునాదులు కదులుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ గన్ కల్చర్, గంజాయి కల్చర్ కొనసాగిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చి 46 నెలలు అయినా ప్రత్యేక హోదా ఉసేలేదని ఏద్దేవా చేసారు. లాండ్, సాండ్, బియ్యం, వైను మాఫియాకు కొమ్ముకాస్తున్నరని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రతి విషయంలోనూ మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ములేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఎన్నుకున్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కరోనా పోయింది కానీ,  అతి ప్రమాదకరమైన నరేంద్ర మోడీని కూడా పారద్రోలాలని అన్నారు. 9 సంవత్సరాల అధికారంలో బీజేపీ, 4 సంవత్సరాల అధికారంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తున్నాయన్నారు. అందుకే ప్రజలంతా సిపిఐ, సీపీఎం పార్టీలు చేస్తున్న ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే మహానుభావుల త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్ర్యశీ, దేశ ప్రజల ఆస్తులు, రాజ్యాంగ విలువలు, వ్యవసాయ రంగం, కార్మిక చట్టాలు అన్నిటిని ఈ దుష్ట పాలకులు సర్వనాశనం చేసేస్తారని తెలిపారు.
 ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, పట్టణ నాయకులు అప్పరుబోతు జగన్నాధం లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img