Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జి.ఎమ్.ఆర్. ఐ. టి.లో మెగా రక్త దాన శిబిరం: 339 యూనిట్ల రక్తదానం

విజయనగరం జిల్లా. రాజాం : రాజాం జి.ఎమ్.ఆర్.ఐ. టి., ఎన్. ఎస్. ఎస్. యూనిట్ మరియు యూత్ రెడ్ క్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లా శాఖల మరియు రాజాం రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ సహకారంతో గురువారం మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. గురువారం క్యాంపస్ లో లాంఛనంగా ప్రారంభించిన ఈ మెగా రక్త దాన శిబిరంలో శిబిరంలో 339 మంది విద్యార్థులు మరియు సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జి. ఎమ్.ఆర్. వి.ఎఫ్. సి. ఓ. ఓ. ఎల్. ఎమ్. లక్ష్మణ మూర్తి, ప్రిన్సిపాల్ డా. సి.ఎల్. వి.ఆర్. ఎస్. వి. ప్రసాద్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్త దానం చేయడానికి ముందుకు రావాలని, రక్త దానం చేయడం తమ వంతు భాద్యత గా ప్రతి ఒక్కరూ భావిచాలన్నారు. ఒక యూనిట్ రక్త దానంతో ముగ్గురి ప్రాణాలను కాపడవచ్చునన్నారు. తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన కార్యక్రమాలవంటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులను, సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో సి. ఏ. ఒ. డా. సప్రియో భట్టాచార్య, అసోసియేట్ డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ డా. వి. రాంబాబు, వివిధ విభాధిపతులు పాల్గొని విద్యార్థులను ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జి. ఎమ్. ఆర్. ఐ. టి. విద్యార్థులు, సిబ్బంది అధిక సంఖ్యలో రక్త దానం చేస్తున్నారని ఈ సందర్భంగా దాతలను, కళాశాల మనేజ్మెంట్ ను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు వివిధ విభాగాల అధిపతిలను ఇండియన్ రెడ్ క్రాస్ వారు సత్కరించారు. ఈ సందర్భంగా రాజాం రెడ్ క్రాస్ అధ్యక్షులు కొత్త సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇంత పెద్ద రక్త దాన శిబిరాన్ని తమ రాజాం శాఖలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఎన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా.కె.వి.ఎస్. ప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో కళాశాల ఫీజికల్ డైరెక్టర్ డా.బిహెచ్. అరుణ్ కుమార్ జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య, రెడ్ క్రాస్ సభ్యులు బి. సతీష్ కుమార్, ఐ టెక్నీషియన్ సుజాత, బి. చిన్మయ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్. ఎస్. ఎస్. వాలంటరీస్ రెడ్ క్రాస్ వాలంటరీ తమ సేవలను అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img