Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

15వ ఆర్థిక సంఘం నిధుల్లో హరిత రాయబారులు వేతనాలు చెల్లించండి

విశాలాంధ్ర,సీతానగరం: ఇటీవల గ్రామ పంచాయతీలకు జమఅయిన 15వ ఆర్ధిక సంఘం నిధుల్లో మొదటి ప్రాధాన్యతగా గ్రామాల్లోని చెత్తను తొలగించే హరిత రాయబారులు వేతనాలు చెల్లించండని ఎంపిడిఓ ప్రసాద్, ఈఓపిఆర్డీ వర్మలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, పి ఎఫ్ ఎం ఎస్ ద్వారా చెల్లింపులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరు, జిల్లా పంచాయతీ అధికారి అదేశాలు,సూచనలు మేరకు తప్పనిసరిగా హరిత రాయబారుల వేతనాలు చెల్లించాలని కోరారు. ఇటీవల సమిత్వ ద్వారా సర్వే నిర్వహించి గ్రామ కంఠాల గుర్తింపుచేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ కంటాల్లో అదనపు నిర్మాణాలు, పదిఇళ్లు ఒకే చోట నిర్మించిన వాటిని పరిశీలించి వాటిని విస్తరించిన గ్రామ కంఠంగా గుర్తించాలని కోరారు. జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చే పిర్యాదులు ఆన్లైన్ లో నమోదు,పరిష్కారం చేయాలని కోరారు. ప్రియా సాప్ట్ వేర్ ద్వారా 2021- 2022 ఆర్థిక సంవత్సర ఆదాయ వ్యయాలు పూర్తి చేసిన గ్రామ పంచాయతీలు 2022- 2023 ఆర్థికసంవత్సర ఆదాయ వ్యయాలను ప్రియా సాప్ట్ వేర్ ద్వారా పూర్తి చేయాలని కోరారు. ఈ సాప్ట్ వేర్ పనులను పూర్తిచేసి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని కోరారు. గ్రామాల్లోని వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులు నిర్వహించాలని సూచించారు. కార్యదర్శుల సందేహాలు నివృత్తి చేశారు. ఈసమావేశంలో 35గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.అనంతరం రెండోపూట 21గ్రామసచివాలయంల ఇంజినీరింగ్ సహయకులతో ఎంపిడిఓ ప్రసాద్ సమావేశం నిర్వహించి గ్రామాల్లోని అభివృద్ధి పనులు, గృహ నిర్మాణ పనులు, నాడు నేడు పనులు వేగవంతంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img