Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

నేనెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయను..: రాహుల్‌గాంధీ

తానెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయనని, తప్పుడు వాగ్దానాలను వినాలనుకుంటే ప్రధాని మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. కేవలం సత్యం మాట్లాడటమే తనకు నేర్పించారని చెప్పారు. మంగళవారం పాటియాలా జిల్లా, రాజ్‌పురలో శాసన సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ప్రమాదం నుంచి పంజాబ్‌ బయటపడాలంటే ప్రతి ఒక్కరూ సమైక్యంగా నడవాలన్నారు. హోషియార్‌పూర్‌, గురుదాస్‌ పూర్‌లలో జరిగిన సభలలో మాట్లాడుతూ, పంజాబ్‌ను కాంగ్రెస్‌ బాగా అర్థం చేసుకోగలదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్లధనం, నిరుద్యోగం గురించి మాట్లాడటం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img