Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

భగ్గుమన్న పెట్రోలు, లీటరు రూ.420

కొలంబో: శ్రీలంకలో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్‌ ధరలు 24.3 శాతం, డీజిల్‌ ధరలు 38.4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.82లు పెరిగి ప్రస్తుతం 420 రూపాయలు, డీజిల్‌ రూ.111లు పెరిగి రూ.400 కు చేరింది. ఏప్రిల్‌ 19 నుండి రెండోసారి ధరల పెంపుతో ఇంధన ధరలు ఆల్‌ టైమ్‌ గరిష్టానికి చేరాయి. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విదేశీమారక నిల్వలు భారీగా క్షీణించడంతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వరంగ సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రకటించింది. ఈపరిస్థితుల్లో ఆటో ధరలు భారీగా పెరిగాయి. మొదటి కిలోమీటరుకు రూ.90లు, రెండవ కిలోమీటరుకు రూ.80 తీసుకుంటామని వెల్లడిరచారు. శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడం కూడా వినియోగదారుల పరిస్థితి దారుణంగా ఉంది. అన్ని నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడిరది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంటగ్యాస్‌, ఇతర నిత్యావసరాలకోసం ప్రజలు బారులు తీరారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం రేటు 40 శాతం నమోదవడం, ముఖ్యంగా నిత్యావసరాలైన ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో దేశవ్యాప్తంగా నిరసనలు పెద్దఎత్తున చెలరేగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img