Monday, May 20, 2024
Monday, May 20, 2024

శ్రీలంక ప్రజలకు కమ్యూనిస్టుల మద్దతు

కొలంబో : శ్రీలంకలో కార్మికులు, ప్రజల పోరాటానికి కేకేఈ పూర్తి సంఫీుభావం ప్రకటించింది. దేశంలో ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల కొరతతో ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాన్ని పారద్రోలి కార్మికులు, ప్రజల హక్కుల రక్షణ కోసం దేశంలోని కమ్యూనిస్టులైన పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జెవిపి) చేపట్టిన పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ మద్దతు ప్రకటించింది. గ్రీస్‌ ట్రేడ్‌ యూనియన్‌ పవర్‌ హౌస్‌ ఆల్‌-వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పీఏఎమ్‌ఈ) తమ మద్దతు ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ఎన్‌పీపీ, జేవీపీ నాయకురాలు అనురా దిసనాయకే మాట్లాడుతూ..తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన గొటబయ రాజపక్సే ప్రపంచంలోని ఇతర నియంతల మాదిరిగా పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తం చేశారు. రక్తం చిందించకుండా ఎంతో ప్రజాస్వామ్యయుతంగా పోరాటంలో విజయం సాధించామన్నారు. గొటబయ రాజపక్సే, రణిల్‌ విక్రమసింఘే అధికారాన్ని వదులుకుంటామని అధికారికంగా ప్రకటించనందున, దానిని వెంటనే అమలు చేయాలని ఉద్ఘాటించారు. దేశాన్ని దోచుకున్న సంపదను వెలికితీయడానికి, న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని, ఈ ప్రజాస్వామిక ప్రజా పోరాట వాస్తవాలను అర్థం చేసుకుని విజయపథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ అవినీతి పాలన నుండి బయటపడేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు, వివిధ సంస్థలు ఎన్‌పిపితో కలిసిపోరాటం చేశాయని అందుకు గాల్‌ఫేస్‌ కార్యకర్తలు ఎంతో త్యాగం చేశారని, దీనికి పార్టీ కృతజ్ఞత, గౌరవాన్ని ప్రకటిస్తున్నామని కేకేఈ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img