Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గోదావరి మహోగ్రరూపం

లంకగ్రామాలు బిక్కుబిక్కు
మునిగిన ఉద్యాన పంటలు, నర్సరీలు
భద్రాచలం వంతెనపై రాకపోకలు నిషేధం

విశాలాంధ్ర-కాకినాడ:
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది వరద ప్రవాహం ఉగ్ర రూపం దాల్చింది. అంతకంతకూ నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి చూస్తుంటే 1986 వరద పునరావృతం అవుతుందనే అనుమానం గోదావరి వాసులకు కలుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం, ఎగువ భద్రాచలం, కూనవరం, పోలవరం ప్రాంతాల్లో గోదావరి ప్రమాదస్థాయి మించి ప్రవహిస్తోంది. భద్రాచలంలో ప్రస్తుతం 63 అడుగులు నీటిమట్టం అంటే ప్రమాదస్థాయికి మించి 10 అడుగులకు పైగా నమోదై 26 లక్షలు క్యూసె క్కులు విడుదల చేయడంతో బాహ్య ప్రపం చంతో సంబంధాలు లేకుండా పోయాయి. అలాగే గోదావరి ఎగువ పరీవాహక ప్రాంత మైన కూనవరంలో 23 మీటర్లు నీటిమట్టం నమోదైంది. కాళేశ్వరం 16.610 మీటర్లు నీటిమట్టం ఉండగా అదే సమయంలో 28లక్షలు క్యూసెక్కుల వరద నీరు ప్రవహి స్తోంది. అంటే కాళేశ్వరం నుంచి వరద నీటి ప్రవాహం 30 గంటల్లో భద్రాచలం చేరు తుంది. అక్కడ నుంచి వచ్చే భారీ వరద 18 గంటల్లో ధవళేశ్వరం బ్యారేజికి వస్తుంది. దీంతో గురువారం రాత్రికే ధవళేశ్వరం బ్యారేజి వద్ద మూడో ప్రమాద హెచ్చరికకు మించి వరద ప్రవహిస్తుంటుంది. అలా అయితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఎనిమిది మండలాలు, అంబేద్కర్‌ కోనసీమలో 20 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 మండలాలు, ఏజెన్సీ మండలాలతో ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐదు మండలాలతో పాటు కాకినాడ జిల్లాల్లోని రెండు మండలాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత జిల్లాలు, మండలాలు, అధికారులు అప్రమ త్తంగా ఉండాటంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ ప్రకటించింది. అలాగే గోదావరీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి ఉప్పొంగుతుండటంతో ఎగువ నుంచి గంట గంటలకు వరద ప్రవాహం ధవళేశ్వరం క్యాటన్‌ బ్యారేజి వస్తుండటంతో గోదావరి దిగువన ఉన్న కోనసీమ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే లంక గ్రామాలకు రాకపోకలకు పూర్తిగా లేకుండా పోయాయి. కోనసీమ పరిధిలోని లంక ప్రాంతాలు జలదిగ్బందంలో ఉన్నాయి. రాజమహేంద్రవరం నగర పరిధిలోగల కేతావారి లంక, బ్రిడ్జిలంక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సీతానగరం మండలంలోని ములకల్లంకను వరద చుట్టుముట్టంది. విజ్జేశ్వరం నుంచి ఇనుక తవ్వే బోట్లను రప్పించి లంక వాసులు రాకపోకలకు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని గురువారం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ మాధవీలత, ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే రాజా పరిశీలించారు. అలాగే నిడదవోలు, పెరవలి మండలాల్లో పల్లపు లంక భూముల్లోకి వరద నీరు చేర డంతో పూలతోటలు, ఉద్యాన పంటలకు ఇబ్బందిగా మారిందని రైతులు వాపోతు న్నారు. కొవ్వురు మండలం మద్దూరు లంకకు ముంపు ముప్పు ఎదురవగా.. గ్రామంతో పాటు గట్ల పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. కడియం మండల పరిధిలోని కడియపు లంక, పొట్టిలంక, బుర్రి లంక శివారు ప్రాంతాల్లోని ఉద్యాన పంటలు, నర్సరీ మొక్కలు నీటమునగడంతో నర్సరీ రైతులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏటిగట్లు బలహీనంగా ఉండటం, భారీ వరద ప్రవాహంతో ముప్పు పొంచి ఉందని అధికారులు కూడా భావిస్తున్నారు. గురువారం ధవళేశ్వరం సర్‌ఆర్దర్‌ కాటన్‌ బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం 16.00 అడుగులు. ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 16,42,665 లక్షల క్యూసెక్కులు ఉంది. కాలవలు ద్వారా 3700 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
భద్రాచలం వద్ద 61.90 అడుగులు నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. భద్రాచలం వద్ద ప్రవాహం 61.80 అడుగులకు చేరింది. 1976 నుంచి నది 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి వంతెనను మూసివేశారు. భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ ప్రకటించారు. అయితే, భద్రాచలం వంతెన చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారి. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆంక్షలు అమలులోకి రాగా.. 48 గంటల పాటు కొనసాగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img