Homeజిల్లాలువిజయనగరండిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం

డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర – విజయనగరం : ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా సీనియర్ నాయకులు మిత్తిరెడ్డి మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. ఈ సందర్భంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో వ్యాక్సిన్ వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే మనందరి బాధ్యతతో పాటు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అంగన్వాడి సిబ్బంది, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పని చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మధుసూదనరావు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు