Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

24కు పెరిగిన మృతులు

ఇజ్రాయిల్‌పలస్తీనాలో యుద్ధ వాతావరణం గాజా : ఇజ్రాయిల్‌పలస్తీనా మధ్య మరోమారు ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరుపగా మృతుల సంఖ్య ఆదివారానికి 24కు పెరిగింది. మరణించిన వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. గాజాతో పాటు అనేక నగరాలపై బాంబుల వర్షాన్ని ఇజ్రాయిల్‌ కురిపించినట్లు అధికారులు వెల్లడిరచారు. పలస్తీనా ఇస్లామిక్‌ జిహార్‌ ఉగ్రసంస్థ సీనియర్‌ కమాండర్‌ను ఇజ్రాయిల్‌ మట్టుబెట్టిన క్రమంలో ఈ ఘర్షణ మొదలు అయింది. ఇప్పటివరకు హమాస్‌ ఆచితూచి వ్యవహరించారు. ఏడాది కిందట కూడా ఈ రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం జరిగింది. 15ఏళ్లలో అనేక చిన్న యుద్ధాలు జరిగాయి. పలస్తీనా తీవ్రవాదులు శనివారం అర్థరాత్రి జరిపిన రాకెట్‌ దాడిలో ఉత్తర గాజాలోని జాబాలియా పట్టణంలో చిన్నారులతో పాటు పౌరులు మరణించినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం పేర్కొంది. దర్యాప్తు జరిపించగా ఇస్లామిక్‌ జిహాద్‌ తరపు నుంచి పొరపాటు జరిగినట్లు వెల్లడి అయిందని తెలిపింది. ఈ ఘటనపై పలస్తీనా వైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img