Friday, April 26, 2024
Friday, April 26, 2024

కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడు
గుస్తావో పెట్రో ప్రమాణ స్వీకారం

మొదటి ఆఫ్రో`కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్‌

బొగొటా : కొలంబియాకు మొట్టమొదటి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక అసమానతలు, డ్రగ్స్‌ హింసతో సతమతమవుతున్న దేశంలో అనేక సంస్కరణలను చెపట్టనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సెనేట్‌ అధ్యక్షుడు రాయ్‌ బర్రేరాస్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి 1,00,000 మంది హాజరైనట్లు సమాచారం. స్పెయిన్‌ రాజు ఫిలిప్‌ 6, తొమ్మిది లాటిన్‌ అమెరికా దేశాల అధ్యక్షుడు, కొలంబియా ప్రముఖులను పెట్రో ఆహ్వానించారు. తొలి ఆఫ్రో`కొలంబియా మహిళ నూతన ఉపాధ్యక్షురాలిగా ఫ్రాంసియా మార్కెజ్‌ (40) బాధ్యతలు చేపట్టారు. పెట్రో(62) మాజీ సెనేటర్‌, గెరిల్లా ఎం17 దళ సభ్యుడు. దేశంలో 50 మిలియన్లు (ఐదు కోట్ల మంది) ఆకలిని తీర్చేందుకు కృషిచేస్తానని పెట్రో చెప్పారు. 5.8 బిలియన్‌ డాలర్ల పన్ను సంస్కరణలను సంకల్పించారు. సామాజిక కార్యక్రమాలకు నిధుల కోసం సంపన్నులపై సుంకాలు పెంచే ప్రతిపాదనను కాంగ్రెస్‌ ముందర సోమవారం కొత్త ఆర్థిక మంత్రి జోసే ఆంటోనియో ఓకాంపో ఉంచనున్నారు. అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు ఆందోళనగానే ఉందని ఇటీవల బొగొటోలోని ఆల్మామ్యాటర్‌ ఎక్స్‌టర్నాడో యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన పెట్రో అన్నారు. ఉచిత యూనివర్సిటీ విద్యకు, ఆరోగ్య సంరక్షణ రంగంలో మార్పులకు హామీనిచ్చారు. పింఛన్‌ సంస్కరణలు చేపడతానని అన్నారు. కొత్త చమురు అభివృద్ధి కార్యక్రమాలను నిపిలివేస్తానని చెప్పారు. ఈయన గతంలో బొగొటా మేయర్‌గానూ పనిచేశారు. నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (ఈఎన్‌ఎన్‌) రెబల్స్‌తో శాంతి చర్చలను పునరుద్ధరిస్తానని హామీనిచ్చారు. అలాగే, 2016శాతం ఒప్పందానికి అర్జీ పెడతానన్నారు. జూన్‌లో జరిగిన ఎన్నికల్లో గుస్తావో పెట్రో కష్టపడి గెలిచారు. చాలా కాలంగా ఈ దేశంలో కన్జర్వేటివ్‌ పరిపాలన ఉంది. శతాబ్దాలుగా శాంతికి నోచుకోని కొలంబియాలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం కృషిచేస్తుందని పెట్రో ఉద్ఘాటించారు. పర్యావరణ న్యాయం కోసం పోరాడుతుందని ఆయన స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img