Monday, May 6, 2024
Monday, May 6, 2024

యువతకు ఉపాధి బాటలో “శ్రీధర్స్ సిసిఇ”

ఉపాధి రంగంలో నిబద్ధత, సమయపాలనతోనే విజయానికి నాంది
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : నేటి యువతకు ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత వారి మంచి భవిష్యత్తు కోసం ఏమి చేయాలో నిర్ణయం తీసుకోవడంలో సతమతమవుతున్నవారికి యువతకు బాసటగా 2007 సం.” శ్రీధర్ సిసిఈ“ ప్రారంభించి ఇప్పటివరకు వేలాదిపైగా తమ సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి మంచి భవిష్యత్తు కల్పించి ఏ కేక సంస్థ అని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది.
తమదైన శైలిలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ రంగసంస్థల్లో, వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాలను కల్పించే విధంగా శిక్షణ అందించి తీర్చిదిద్దుతూ అనంతలో ఒక పరిశ్రమలా ఏకైక కాంపిటీటివ్ శిక్షణ సంస్థగా శ్రీధర్స్ సిసిఇ సంస్థ ముందుకు సాగుతోంది. ఈ సంస్థలో శిక్షణ తీసుకున్న ఈ. శ్రావణి ఇండియన్ బ్యాంక్ నందు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ గా ఎన్నికైనందుకు శ్రీధర్ సి సి ఏ సంస్థ డైరెక్టర్లు శేషుకుమార్, అరవింద కుమారులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ. శ్రావణి విలేకరులతో మాట్లాడుతూ… మా తల్లితండ్రులైనటువంటి ఈ. నాగరాజు, ఈ. వింద్యామణి శిక్షణ సమయంలో వారు నాకెంతగానో చేయూతని ఇచ్చారన్నారు. ఈ శిక్షణలో క్లాస్ రూమ్ టీచింగ్, రెగ్యులర్ మాక్ టెస్ట్ లు, లైబ్రరీ ఫెసిలిటీ, ఇంటర్వ్యూ గైడ్లైన్స్, దీంతోపాటు ఆన్లైన్ క్లాసెస్ లో ముఖ్యంగా మోటివేషనల్ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఈ సంస్థ ద్వారా వేలాదిమంది యువత వివిధ ప్రభుత్వ,బ్యాంకింగ్ ఉన్నత అధికారులుగా పనిచేస్తున్న వారి స్థానంలో ఈ సంస్థ ద్వారా నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నేను ఎస్ వి యు ఏజీ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదవడం జరిగిందన్నారు. నాకు మంచి శిక్షణ తో పాటు ఎప్పటికప్పుడు మంచి సలహాలు సూచనలు ఇవ్వడంతోనే బ్యాంకింగ్ రంగంలో ఉపాధి రావడానికి శిక్షణ ఇచ్చిన సంస్థ డైరెక్టర్లు శేషు కుమార్, అరవింద్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లితండ్రులు మాట్లాడుతూ… మా శ్రావణి కష్టపడి చదివి ఎంతో పట్టుదల, దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఉద్యోగం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ డైరెక్టర్లు మాట్లాడుతూ… మా శిక్షణ సంస్థ 2007లో అనంతలో స్థాపించడం జరిగిందన్నారు. మా దగ్గర శిక్షణ పొందిన వారు ప్రభుత్వ, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థానంలో పనిచేయడం మాకు గర్వంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img