Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

సీపీఐకి జననీరాజనం

పత్తికొండలో కార్యకర్తల విస్తృత ప్రచారం
రామచంద్రయ్యకు పెరుగుతున్న ఆదరణ

కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి పీ రామచంద్రయ్యకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. రామచంద్రయ్యని గెలిపించాలని కోరుతూ సీపీఐ, ఇండియా కూటమి శ్రేణులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలు ఉన్నాయి. పత్తికొండ అంటే ఉద్యమాల పురిటిగడ్డగా ప్రతి ఒక్కరికి సుపరిచితం. సీపీఐ జాతీయ, రాష్ట్ర సమితి ఎటువంటి పిలుపు ఇచ్చిన ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. అమరజీవి చదువుల రామయ్య సారధ్యంలో, ఆయన తరువాత కూడా పత్తికొండ, తుగ్గలి, మద్దికెర ,క్రిష్ణగిరి , వెల్దుర్తి ప్రాంతాల్లో పెత్తందారులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. భూమి లేని పేదల కోసం భూ పోరాటాలు చేసి వందలాది ఎకరాల భూములు పంపిణీ చేసిన చరిత్ర ఇక్కడి సీపీఐకి ఉంది.ఈ ప్రాంతంలో కరవు విలయతాండవం చేస్తుంటే సాగునీటి ప్రాజెక్టులు కావాలని, వలసలు నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితమే హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టు నీటి ద్వారా చెరువులు నింపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా నాటి ప్రభుత్వం 106 చెరువులకు నీల్లు నింపేందుకు అంగీకరించి పనులుకూడా ప్రారంభించింది. నియోజవర్గంలో ప్యాక్షన్‌తో అనేక హత్యలు జరిగాయి. చివరకు ఎమ్మెల్యేను కూడా చంపిన చరిత్ర పత్తికొండలో ఉంది. పత్తికొండ కమ్యూనిస్టుపార్టీకి అడ్డా, పోరాటాల పురిటిగడ్డగా జిల్లా ప్రజలకు సుపరచితం. నియోజకవర్గంలో జరుగుతున్న హత్యారాజకీయాలు వ్యతిరేకంగా దళిత , బడుగు బలహీన వర్గాల వారికి , రైతులకు, వ్యవసాయకూలీలకు,విద్యార్థి యుజవనులకు, మహిళలకు అండగా కమ్యూనిస్టుపార్టీ , ఎర్రజెండా నిలిచింది. సీపీఐ అభ్యర్థి సీనియర్‌ నాయకులు పీ రామచంద్రయ్య కూటమి అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఆయన ప్రచారానికి జనం నీరాజనం పడుతున్నారు. రామచంద్రయ్యకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధికూలీలు, విద్యార్థులు, యువజనులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం చేపట్టారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ, ఏఐకెఎస్‌ జాతీయ నాయకులు ఆర్‌ వెంకయ్య ప్రచారం నిర్వహించి తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య నాయకత్వంలో సీపీఐతోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి,యువజన సంఘాల నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార ప్రతిపక్షపార్టీల నాయకులకు ధీటుగా గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు తమ పాటల ద్వారా ప్రజల్లో ఉత్తేజం నింపుతున్నారు. సీపీఐ నాయకుల ప్రచారంలో అసెంబ్లీలో సీపీఐ అభ్యర్థులు లేని లోటును ఎత్తిచూపుతూ రామచంద్రయ్యను గెలిపించాల్సిన అవశ్యకతను వివరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థి పీ రామచంద్రయ్యకు కంకికొడవలి గుర్తుపై ఓటువేయాలని, రామచంద్రయ్యకు ఒక్క అవకాశం ఇవ్వలని, పార్లమెంట్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాంపుల్లయ్యయాదవ్‌కు ఓటువేసి గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img