Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఏపీలో కొత్త రికార్డు

లోక్‌సభ అభ్యర్థుల్లో 42 శాతం పెంపు
అసెంబ్లీ నామినేషన్లు పైపైకి

ఎన్నికల్లో వరుసగా అభ్యర్థుల సంఖ్య పెరగడమన్నది ఆంధ్రప్రదేశ్‌లో ఆనవాయితీగా మారింది. 1997 లోక్‌సభ ఎన్నికల ప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 165 మంది పోటీ చేశారు. 2014 ఎన్నికల నాటికి ఈ సంఖ్య 598కు పెరిగింది. 2019లో 762 (319మంది ఏపీలో, 443 మంది తెలంగాణలో కలిపి)కు చేరుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ అభ్యర్థుల సంఖ్య 454కు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే 1955లో 581 మంది పోటీ చేయగా 1967లో అభ్యర్థుల సంఖ్య 1,067కు పెరిగింది. 2019లో 2,118కు ఎగబాకింది. తాజా ఎన్నికల్లో ఏకంగా 2,387 మంది పోటీ చేస్తున్నారు. 195060వ దశకాల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక్కో స్థానం నుంచి ముగ్గురు నలుగురు మాత్రమే పోటీ చేసేవారు కానీ 2019 నాటికి ఈ సంఖ్య 12కు చేరుకుంది. తాజా ఎన్నికల్లో సగటున 14 మంది ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్లు తేలింది. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి 34 మంది పోటీ చేయగా తాజాగా తిరుపతి నుంచి 46 మంది బరిలో నిలవడంతో రాష్ట్రంలో కొత్త రికార్డు నమోదైంది. ఈసారి లోక్‌సభకు అత్యధికంగా విశాఖపట్నం నుంచి 33 మంది పోటీ చేస్తుండగా అత్యల్పంగా రాజమండ్రి నుంచి 12 మంది బరిలో నిలిచారు. అలాగే అసెంబ్లీకి తిరుపతి నుంచి అత్యధిక మంది పోటీ చేస్తుండటం అత్యల్పంగా చోడవరం నుంచి ఆరుగురు పోటీ చేస్తున్నారు. పూర్వంతో పోల్చుకుంటే లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు గణనీయంగా పెరిగారు. ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోఉన్నాయి. 25 లోక్‌సభ స్థానాల నుంచి 454 మంది పోటీ చేస్తున్నారు. 2019 కంటే 42శాతం ఎక్కువ మంది ఈసారి పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో 319 మంది పోటీ చేశారు. 173 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2,387 మంది తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019 ఎన్నికలతో పోల్చితే అభ్యర్థుల సంఖ్యలో 13శాతం పెంపుదల ఉంది. గతసారి 2,118 మంది పోటీ చేశారు.
2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ పోటీ చేయగా 173 చోట్ల బీజేపీ, 137 స్థానాల్లో జనసేన పోటీ చేశాయి. తాజా ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. 175 నియోజకవర్గాల నుంచి ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాయి. కూటమి ఏర్పడటంతో అభ్యర్థులు తగ్గుతారన్న అంచనాలు తారుమారు చేస్తూ నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణ ప్రక్రియ ఇటీవల ముగిసింది. అభ్యర్థుల సంఖ్య పెరగానికి రిజిస్టర్డ్‌ అన్‌ రికగైజ్డ్‌ పార్టీలు (ఆర్‌యూపీపీలు) కారణమని తెలుస్తోంది. ఈ పార్టీల నుంచి ప్రతి నియోజకవర్గంలో 5`10 మంది పోటీ చేస్తున్నారు. స్వతంత్రులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణకు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి 46మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 26మంది స్వతంత్రలు కాగా 13 మంది ఆర్‌యూపీపీల అభ్యర్థులు ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), వైసీపీ, జనసేన, బహుజన్‌ సమాజ్‌ పార్టీ వంటి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img