Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

డాక్టర్ సి. జి.పద్మావతి సేవలు మరువలేనివి

కంటి వైద్య విభాగం లో ఎనలేని సేవలు చేసిన డాక్టర్ పద్మావతి
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కంటి వైద్య విభాగం ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ సి.జి.పద్మావతి పదవీ విరమణ సందర్భంగా వైద్య కళాశాలలోని సుశ్రుత హాల్లో పదవీ విరమణ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ ఆచార్య డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం అనంతపురం శాఖ అధ్యక్షులు ఆచార్య డాక్టర్ రామస్వామి నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ డాక్టర్ పద్మావతి సేవలు స్ఫూర్తిదాయకమని, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కంటి వైద్య విభాగం అభివృద్ధిలో తన పాత్ర అనంతమైనదని తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నీతి,నిజాయితీ తో ,క్రమశిక్షణ తో వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించిన అతి కొద్ది మందిలో అగ్రగణ్యులు డాక్టర్ సి జి పద్మావతి ని, అనేక కంటి శస్త్ర చికిత్సలను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అనంతపురం నందు 30 సంవత్సరములకు పైగా నిర్విరామంగా చేసి ఎంతోమందికి నేత్రదానాన్ని ప్రసాదించాలని తెలిపారు. ఏపీ జి డి ఏ ప్రెసిడెంట్ ఆచార్య డాక్టర్ రామస్వామి నాయక్ మాట్లాడుతూ ఈరోజు ఆఫ్తల్మాలజీ డిపార్ట్మెంట్ ఇంత అభివృద్ధి పథంలో పయనిస్తుంది అంటే దానిలో డాక్టర్ పద్మావతి మేడం కృషి ఎంతో ఉందని తెలిపారు. ఆ తరువాత ఏపీ జి డి ఏ ఆధ్వర్యంలో మరియు వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో డాక్టర్ సి జి పద్మావతిని శాలువా పుష్పగుచ్చాలు,జ్ఞాపకాలతో అనేక మంది సన్మానించారు. డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ భగవంతుడు ప్రసాదించిన వైద్య వృత్తిని అంతఃకరణ శుద్ధితో నిర్వహించి నా వృత్తి ధర్మాన్ని దైవసంకల్పంగా భావించి సుమారు 30 సంవత్సరములకు పైగా ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహించానని, నాకు తోడ్పాటు అందించిన అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లకు, ఆంధ్ర ప్రదేశ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ డాక్టర్లకు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ సభ్యులకు, ఉమెన్స్ వింగ్ డాక్టర్లకు, ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్లకు ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ అక్బర్ సాహెబ్, డాక్టర్ కొండయ్య,డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ , ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ కేఎల్ సుబ్రమణ్యం, ఆచార్య డాక్టర్ శారోన్ సోనియా, ఆచార్య డాక్టర్ నవీన్, కంటి వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై ఎం ఎస్ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె వి మానస, డాక్టర్ దివ్య, డాక్టర్ శ్రీనివాస ఫణి, డాక్టర్ భవాని శంకర్, ఆప్తాల్మోలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు,ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img